స్టార్ హీరో విపరీత బుద్ది.. వైద్యం చేసిన నర్సుతోనే, భరించలేకపోయిన భార్య.. చివరకు!

హాలీవుడ్ నటులు అప్పుడప్పుడూ తమ విపరీత బుద్దిని బయట పెడుతుంటారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ పరువు మంటగలిసింది. ఫలితంగా అతడి భార్య జెన్నిఫర్ గ్రానెర్ అతడి నుంచి విడాకులు పొందింది. బెన్ అఫ్లెక్ విపరీత బుద్ధుల్ని చాలా కాలం జెన్నిఫర్ భరించింది. కానీ అతడితో వేగలేక అధికారికంగా విడిపోయింది. జెన్నిఫర్ గ్రానెర్, బెన్ విడాకులకు దారితీసిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. కానీ చివర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడం కొసమెరుపు.

 అధికారికంగా విడాకులు

అధికారికంగా విడాకులు

బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ గ్రానెర్ మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయని చాలా కాలంగా హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కోర్టు సమక్షంలో విడాకులు పొందినట్లు తెలుస్తోంది. వీరిద్దరి విడాకులకు బెన్ శృంగార లీలలే కారణం అంటూ ప్రచారం జరుగుతోంది.

 వాళ్లద్దరితో ఘాటు ఎఫైర్లు

వాళ్లద్దరితో ఘాటు ఎఫైర్లు

బెన్ అఫ్లెక్ చాలా కాలంగా హాట్ మోడల్ ఎమిలీ, తన సహనటి ఔజినియన్ తో రొమాన్స్ సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో బెన్ అఫ్లెక్ సతీమణి, నటి అయిన జెన్నిఫర్ గ్రానెర్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయినా కూడా తన భర్త చేష్టలని మౌనంగానే భరించిందట.

చివరకు నర్సుతో కూడా

చివరకు నర్సుతో కూడా

బెన్ అఫ్లెక్ ఇటీవల మద్యానికి తీవ్రంగా బానిసగా మారాడు. మద్యానికి బానిసంగా మారి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రీహాబిటేషన్ సెంటర్ లో వైద్యం చేయించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ సలహా మేరకు ఎలిజిబెత్ వీవర్ అనే డిటాక్స్ నర్సు అతడికి కొంత కాలం వైద్యం అందించిందట. ఆ సమయంలో నర్సుని కూడా బెన్ ముగ్గులోకి దించేశాడు.

సహనానికి కూడా ఒక హద్దు

సహనానికి కూడా ఒక హద్దు

బెన్ ఆ నర్సుతో కలసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీనితో ప్రముఖ నటుడు బెన్ ఒక నర్సుతో డేటింగ్ అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తన భర్త తాగుబోతుగా మారినా, ఇతరులతో తిరుగుతున్నాడని తెలిసినా జెన్నిఫర్ గ్రానెర్ భరించింది. కానీ ఈ వార్తతో పరువు పోవడంతో జెన్నిఫర్ భరించలేక పోయింది. అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది.

 కొసమెరుపు

కొసమెరుపు

ఇటీవలే వీరిద్దరి విడాకులు అధికారికంగా జరిగిపోయాయి. జెన్నిఫర్, బెన్ లకు కుమారుడు కూడా ఉన్నాడు. ఎంత కాదనుకున్నా అతడు నా పిల్లలకు తండ్రి, విడిపోయాక కూడా పిల్లల కోసం స్నేహంగా ఉండాలని జెన్నిఫర్ నిర్ణయించుకుందట. విడాకులు జరిగి కొద్దీ రోజులే అయింది. తాజగా వీరిద్దరూ ఐస్ క్రీమ్ పార్టీలో కనిపించారు. విడిపోయాక కూడా స్నేహం కొనసాగించాలని వీరిద్దరూ నిర్ణయించుకోవడం వల్లే ఐస్ క్రీమ్ పార్టీకి వెళ్లారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X