బ్యాట్‌మ్యాన్‌గా మళ్లీ బెన్ అఫ్లెక్.. క్రిస్టియన్ బాలేకు షాక్.. ట్విట్టర్‌లో ఫ్యాన్‌లో వార్

హాలీవుడ్‌లో బ్యాట్‌మెన్ సిరీస్ అంటే పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా విపరీతమై క్రేజ్ ఉంటుందనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. గతంలో బ్యాట్‌మెన్ పాత్రతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరో బెన్ అఫ్లెక్ మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఎజ్రా మిల్లర్ రూపొందించే ది ఫ్లాస్ మూవీలో బ్యాట్‌మెన్‌ పాత్రను పోషించనున్నటు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ది ఫ్లాష్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ ఆండీ ముషిట్టి మీడియాతో మాట్లాడుతూ.. బ్యాట్‌మెన్ పాత్రలో బెన్ అఫ్లెక్ నటిస్తున్నారు. గతవారమే ఆయనకు సినిమాకు సంబంధించిన స్క్రిప్టును అందజేశాం. ఈ చిత్రంలో నటించేందుకు బెన్ అఫ్లెక్ అంగీకరించాడు అని తెలిపారు. బెన్ అఫ్లెక్ నటిస్తున్న పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కథకు బలమైన అంశంగా మారుతుంది అని పేర్కొన్నారు.

 Ben Affleck will make a comeback as Batman: Big blow for Christian Bale

గతంలో అంటే 2016లో జాక్ స్నైడర్ రూదించిన బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ డాన్ ఆఫ్ జస్టిస్ చిత్రంతో బ్యాట్‌మ్యాన్‌గా బెన్ అఫ్లెక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2016లోనే సూసైడ్ స్క్వాడ్ అనే చిత్రంలో కూడా బ్యాట్‌మెన్‌గా కనిపించారు.

ఇప్పటి వరకు బ్యాట్‌మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన క్రిస్టియన్ బాలే‌ను బ్యాట్‌మ్యాన్ పాత్ర నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ బాలే మాత్రమే గొప్ప బ్యాట్‌మ్యాన్. ఆయనను మించిన బ్యాట్‌మెన్ ఎవరూ ఉండరు అంటూ ట్విట్టర్‌లో అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మా జనరేషన్‌లో ఉత్తమ బ్యాట్‌మ్యాన్ కేవలం క్రిస్టియన్ బాలే అంటూ కామెంట్ల వర్షం కురుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X