twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ అవార్డ్స్ 2018 : ఉత్తమ నటిగా 60 ఏళ్ల మహిళ, ఉత్తమ నటుడు అతడే, బ్లేడ్ రన్నర్ చిత్రానికి!

    |

    Recommended Video

    Oscars 2018: Complete list of Winners ఆస్కార్ అవార్డ్స్ 2018 : ఆస్కార్ విజేతలు

    ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కొనసాగుతోంది. అద్భుత చిత్రాలన్నీ ఆస్కార్ బరిలో నిలిచి అవార్డుని సొంతం చేసుకుంటున్నాయి. దర్శకుల ప్రతిభ, నటుల ప్రతిభ, సాంకేతిక విభాగం ఇలా అన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డుని ఎంపిక చేసారు. విజువల్ ఎఫెక్ట్స్ లో బ్లేడ్ రన్నర్ చిత్రం సత్తా చాటి ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా గ్రే ఓల్డ్ మాన్, ఉత్తమ నటిగా 60 ఏళ్ల ఫ్రాన్సెస్ మెక్ డార్మెన్డ్ ఆస్కార్ గెలుపొందారు.

     ఉత్తమ విదేశీ చిత్రం

    ఉత్తమ విదేశీ చిత్రం

    ఉత్తమ విదేశీ చిత్రంగా 'ఎ ఫాంటాస్టిక్ వుమన్ ' (చిలి) ఆస్కార్ కైవసం చేసుకుంది. రష్యా, హంగ్రీ, స్వీడన్ చిత్రాల పోటీని తట్టుకుని చిలి దేశ చిత్రం అవార్డుని కోసమేతం చేసుకోవడం విశేషం.

    ఉత్తమ సహాయ నటి

    ఉత్తమ సహాయ నటి

    ఉత్తమ సహాయ నటి : అలిసన్ జెన్నీ

    చిత్రం : టాన్య

    58 ఏళ్ల అలిసన్ జెన్నీ ఉత్తమ్ సహాయ నటిగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది.

     ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

    ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

    డియర్ బాస్కెట్ బాల్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ దక్కింది.

     యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్

    యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్

    ఉత్తమ యానిమేషన్ ఫీచర్ చిత్రంగా కోకో చిత్రం అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రానికి లీ ఉంక్రిచ్ దర్శకుడు.

    విజువల్ ఎఫెక్ట్స్

    విజువల్ ఎఫెక్ట్స్

    విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో బ్లేడ్ రన్నర్ చిత్రం సత్తా చాటింది.అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులని ఈ చిత్రం మైమరపింపజేసింది. ఈ విభాగంలో బ్లేడ్ రన్నర్ 2049 చిత్రం ఆస్కార్ సొంతం చేసుకుంది.

     ఎడిటింగ్

    ఎడిటింగ్

    ఉత్తమ ఎడిటర్ : లీ స్మిత్

    చిత్రం : డన్ కిర్క్

    చిత్రానికి సంబంధించి ఎడిటింగ్ కూడా కీలక విభాగం. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ లీ స్మిత్ ఆస్కార్ కైవసం చేసుకున్నారు.

     డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్

    డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్

    ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో 'హెవెన్ ఈజ్ ట్రాఫిక్ జామ్ ఆన్ ది 405' చిత్రం ఆస్కార్ కైవసం చేసుకుంది.

     లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్

    లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్

    ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా 'ది సైలెంట్ చైల్డ్' ఆస్కార్ గెలుచుకుంది.

     అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

    అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

    అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు జేమ్స్ ఇవోరి ఆస్కార్ గెలుచుకున్నారు. 'కాల్ మీ బై యువర్ నేమ్' చిత్రానికి గాను అయన ఆస్కార్ గెలుచుకున్నారు.

     ఒరిజినల్ స్క్రీన్ ప్లే

    ఒరిజినల్ స్క్రీన్ ప్లే

    ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో రచయిత నటుడు అయిన జోర్డాన్ పీలే ఆస్కార్ గెలుచుకున్నారు. గెట్ అవుట్ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి నల్ల జాతీయుడిగా జోర్డాన్ నిలిచారు.

     సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రోజర్ డేకేన్స్

    చిత్రం : బ్లేడ్ రన్నర్ 2049

    చిత్రాల విజయాల విషయంలో సినిమాటోగ్రఫీ ఎటువంటి పాత్ర వహిస్తుంతో అందిరికి తెలిసిందే. 24 క్రాఫ్ట్ లలో సినిమా ట్రోగ్రఫీ కూడా చాలా కీలకం. ఈ విభాగానికి గాను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రోజర్ డేకేన్స్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. బ్లేడ్ రన్నర్ 2049 చిత్రానికి ఈ అవార్డు దక్కింది.

     ఒరిజినల్ స్కోర్

    ఒరిజినల్ స్కోర్

    ఒరిజినల్ స్కోర్ విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు అలెగ్జాన్డరె డెస్ ప్లాట్ ఆస్కార్ గెలుచుకున్నారు. ది షేప్ ఆఫ్ వాటర్ చిత్రానికి ఈ అవార్డు లభించింది.

     ఒరిజినల్ సాంగ్

    ఒరిజినల్ సాంగ్

    కోకో చిత్రంలోని రిమెంబర్ మీ అనే పాటకు ఈ విభాగంలో ఆస్కార్ లభించింది.

    ఉత్తమ దర్శకుడు

    ఉత్తమ దర్శకుడు

    ఉత్తమ దర్శకుడు : గుల్లిర్మో డెల్ట్రో

    చిత్రం : ది షేప్ ఆఫ్ వాటర్

    ఆస్కార్ అవార్డ్స్ 2018 లో ఉత్తమ దర్శకుడిగా గుల్లిర్మో డెల్ట్రో అవతరించాడు. ది షేప్ ఆఫ్ వాటర్ చిత్రానికి ఈ అవార్డు దక్కింది.

    ఉత్తమ నటుడు

    ఉత్తమ నటుడు

    ఉత్తమ నటుడు : గ్రే ఓల్డ్ మాన్

    చిత్రం : డార్కెస్ట్ అవర్

    ఉత్తమ నటుడిగా ప్రముఖ నటుడు గ్రే ఓల్డ్ మాన్ ఆస్కార్ అవార్డుని ఎగరేసుకుపోయాడు. డార్కెస్ట్ అవర్ చిత్రానికి గాను అతడికి అవార్డు లభించింది.

    ఉత్తమ నటి

    ఉత్తమ నటి

    ఉత్తమ నటి : ఫ్రాన్సెన్ మెక్ డార్మెన్డ్

    చిత్రం : త్రి బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్

    60 ఏళ్ల మెక్ డార్మెన్డ్ 'త్రి బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె నటనకు ఆస్కార్ అవార్డు దక్కింది.

     ఉత్తమ చిత్రం

    ఉత్తమ చిత్రం

    ఈ విభాగంలో మొత్తం 9 చిత్రాలు పోటీ పడగా అందులో షేప్ ఆఫ్ వాటర్ విజేతగా నిలిచి ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

    English summary
    Best Actor for Oscars 2018 is Gary Oldman. Best actress is Frances McDormand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X