For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014: గూగుల్ సెర్చింగ్ లో టాప్ సెలబ్రెటీలు(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  న్యూయార్క్: 2014 ముగింపు కి సిద్దం అవుతున్నాయి. అన్నీ లెక్కలు తీస్తున్నారు. ఆ లెక్కల్లో భాగంగా గూగుల్ కంపెనీ తమ సెర్చ్ ఇంజన్ లో ప్రపంచంలో ఎక్కువ సెర్చ్ చేయబడ్డ వారి లిస్ట్ ని విడుదల చేసింది. అంటే ఈ సెలబ్రెటీలకు అంతర్జాలంలో ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట.

  అందులో కిమ్ కర్దిషియన్...బింగ్ లో ఎక్కువ సెర్చ్ చేయబడ్డ సెలబ్రెటీగా ఎంపికైంది. బియాన్సీ ..గూగుల్ బ్రిటన్ లో లో ఎక్కువ సెర్చ్ చేయబడ్డ సెలబ్రెటీగా ప్రకటించబడింది. వీరిద్దరూ సీనియర్లే కావటం విశేషం. వయస్సు మీద పడుతున్నా వన్నె తరగటం లేదు..వారి ఆదరణ ఎక్కడా చెక్కు చదరటం లేదు.

  ముఖ్యంగా బియాన్సీ వివాహానికి సంభందించిన రూమర్, దానికి సంభందించిన వీడియో ఫుటేజి అభిమానులను కలవరపరిచాయి. అవే ఎక్కవగా సర్కులేట్ అయ్యి సెర్చ్ చేయబడ్డాయి. అంతేకాకుండా ఆమె విడుదల చేసిన ఆన్ ది రన్ స్టూడియో ఆల్బమ్ కూడా క్రేజ్ తెచ్చిపెట్టి ఆమెను ఇలా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంచగలగింది.

  ఇంకా ఎవరెవరు టాప్ లో ఉన్నారనేది స్లైడ్ షోలో చూద్దాం...

  Beyonce Knowles

  Beyonce Knowles

  2014లో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రెటీలో ప్రధమ స్ధానంలో వచ్చారీమె. ఆమె తన ఈవింట్స్,రూమర్స్ ద్వారా ఈ సంవత్సరం ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చింది.

  జెన్నీఫర్ లారెన్స్

  జెన్నీఫర్ లారెన్స్

  2014లో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రెటీ ఆమె రెండవ స్ధానంలో వచ్చింది. ఆమె ప్రెవేట్ న్యూడ్ ఫొటోలు హ్యాక్ చేసి బయిటకు రావటంతో వాటి కోసం నెట్ లో వెతుకులాట ఇందుకు దోహదం చేసింది.

  Katy Perry

  Katy Perry

  ఈ సారి కూడా ఈమెను టాప్ టెన్ సెర్చింగ్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. ఆమె పై వచ్చే రూమర్స్, ఆమె గాసిప్స్, ఫొటో షూట్ లు ఈ ప్లేస్ లో ఉంచుతున్నాయి.

  Ariana Grande

  Ariana Grande

  ఈ క్యూట్ సింగర్.. హ్యాకింగ్ స్కాండిల్ లో వార్తల్లోకి వచ్చి ఈ టాప్ టెన్ లో స్ధానం సంపాదించుకుంది. అయితే ఆ ఫొటోలు తనవి కావు అంటే ఖండించింది కానీ అవి బాగా పాపులర్ అయ్యాయి..ఆమె పాటల కన్నా బాగా ...

  Taylor Swift

  Taylor Swift

  ఈ గ్రామీ విన్నర్.. కి ఈ సంవత్సరం అద్బుతమైనదనే చెప్పాలి. ఆమె రిలీజ్ చేసిన సింగిల్ ఆల్బమ్, విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో ఆమెను పై స్దాయికి తీసుకు వెళ్లి ఈ టాప్ టెన్ లో స్దానం ఇప్పించాయి.

  Ed Sheeran

  Ed Sheeran

  ఈ సింగర్..టాప్ మేల్ గూగుల్ సెర్చెడ్ సెలబ్రెటీల లిస్ట్ లో ఈ సంవత్సరం నిలిచాడు.

  Jay Z

  Jay Z

  బియాన్సీ లాగే ఇతను కూడా బాగా పాపులర్ అయ్యి సెకండ్ మేల్ సెలబ్రెటీ సెర్చెడ్ లిస్ట్ లో చేరారు. ఈ సంవత్సరం ఆయన చాలా ఈవెంట్స్ చేసారు.

  Harry Styles

  Harry Styles

  ఇతను మేల్ సెబబ్రెటీ లిస్ట్ లో మూడవ ప్లేస్ లో వచ్చాడు.

  Benedict Cumberbatch

  Benedict Cumberbatch

  ఈ నటుడు ఎంగేజ్ మెంట్ అవటం, ఇతని ఇమిటేషన్ గేమ్ పాపులర్ అవటం, అవార్డుల రావటం వంటివి నాలుగో ప్లేస్ లోకి తీసుకు వచ్చాయి.

  David Beckham

  David Beckham

  ఈ ఆటగాడు మోస్ట్ సెర్చెడ్ మేల్ సెలబ్రెటీల లిస్ట్ లో ఐదవ ప్లేస్ లో వచ్చాడు. గూగుల్ లో ఇతని గురించి రోజులు తరబడి చర్చలు జరగటమే కారణం అంటారు.

  English summary
  Kim Kardashian certainly made 2014 an unforgettable year as the American reality TV star decided to break the internet with her racy pics. If we take a look down the year, there have been some moments which went viral and gathered too much attention.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X