'ప్రపంచంలోనే అత్యంత అందగత్తె' గా బియోన్స్ నోవెల్స్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ పాప్ స్టార్ బియోన్స్ నోవెల్స్. ఈ ముప్పయ్యేళ్ల సౌందర్యరాశిని ఈ ఏడాది 'ప్రపంచంలోనే అత్యంత అందగత్తె'గా ప్రముఖ పీపుల్ మ్యాగజైన్ ఎంపికచేసింది. ఇటీవల జనవరిలో తన మొదటి బిడ్డ 'బ్లూ ఐవీ'కి జన్మను ఇచ్చిన తర్వాత బియోన్స్ నోవెల్స్ అందం మరింత పెరిగిందని పీపుల్ మ్యాగజైన్ ఎడిటర్స్ మ్యాగజైన్ వెబ్ సైట్‌లో తెలిపారు.
2011 సంవత్సరానికి 'ప్రపంచంలోనే అత్యంత అందగత్తె' టైటిల్‌ని తీసుకున్న జెన్నిఫర్ లోపెజ్ చేతుల మీదగా ఈ సంవత్సరం బియోన్స్ నోవెల్స్ ఈ అరుదైన గౌరవాన్ని స్వీకరించనుంది. ఈ సందర్బంలో బియోన్స్ నోవెల్స్ మాట్లాడుతూ నేను నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరింత అందంగా ఉండడమే కాకుండానేను ఇంతవరకు పొందని అనుభూతి పొందానని అన్నారు. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్దేశానికి కనెక్ట్ అవుడం కోసమే ఈ భూమి మీద ఉన్నానని అనుకోలేదన్నారు.
బియోన్స్ నోవెల్స్ మ్యూజిక్ రాపర్ జే-జడ్‌ని ప్రేమించి పెళ్శి చేసుకున్నారు.
గతంలో జనవరి 31వ తేదీ, ఆదివారం నాడు లాస్ ఏంజిల్స్ లో గ్రామీ అవార్డుల్లో ప్రముఖ పాప్ తారలు బియోన్స్ నోవెల్స్, లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్ లు ఈ అవార్డుల్లో తమ సత్తాచాటారు. పది గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన బియోన్స్ నోవెల్స్ అందులో నాలుగు విభాగాల్లో అవార్డులను అందుకున్నారు.


Click it and Unblock the Notifications











