twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇషా అంబానీ పెళ్లి: పాప్ స్టార్ బియాన్స్‌ అదిరిపోయే పెర్పార్మెన్స్, ఎంత చార్జ్ చేసిందో తెలుసా?

    |

    దేశంలోనే అతిపెద్ద కుబేరుడు ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుకను తన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా వైభవంగా నిర్వస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఉదయ్‌పూర్ వేదికగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు హిల్లరీ క్లింటన్ కూడా హాజరై సందడి చేశారు.

    ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు అమెరికన్ పాప్ సింగర్ భియాన్స్ కూడా తన బృందంతో ఇండియా వచ్చారు. ఆమె కోసం ప్రత్యేక విమానం కేటాయించి ఇక్కడకు రప్పించారు. ఆదివారం రాత్రి బియాన్స్ ప్రదర్శన ఇషా అంబానీ పెళ్లి వేడుకలో హైలెట్‌గా చెప్పుకుంటున్నారు.

    బియాన్స్ దేశీ లుక్

    బియాన్స్ దేశీ లుక్

    బియాన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఎరుపు రంగు డ్రెస్సులో ఆమె ఇండియన్ దేశీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డ్రెస్సు డిజైన్ చేసింది సెలబ్రిటీ డిజైనర్ ద్వయం అబూ జానీ, సందీప్ ఖోస్లా అని తెలుస్తోంది.

     బియాన్స్ పెర్ఫార్మెన్స్.. ఉర్రూతలూగిన ప్రముఖులు

    బియాన్స్ పెర్ఫార్మెన్స్.. ఉర్రూతలూగిన ప్రముఖులు

    ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు, బాలీవుడ్ తారలు బియాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ చూసి ఊర్రూతలూగిపోయారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు షారుక్, సల్మాన్, అమీర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

    కోట్ల రూపాయల పారితోషికం

    కోట్ల రూపాయల పారితోషికం

    బియాన్స్ తన బృందంతో కలిసి పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకుగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకల్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బియాన్స్ 2 మిలియన్ డాలర్లు చార్జ్ చేసినట్లు టాక్. దీనితో పాటు తనకు, తన బృందానికి వసతి, ప్రయాణ ఖర్చులు అదనం. మొత్తం కలిపి ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం దాదాపు రూ. 15 నుంచి 20 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ముఖేష్ అంబానీ లాంటి వారికి ఈ ఖర్చు పెద్ద లెక్కేకాదు.

    వైరల్ అవుతున్న వీడియో

    బియాన్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్డ్ కలర్ డ్రెస్సులో ఆమె నడుము ఊపుతూ డాన్స్ చేస్తుంటే సెలబ్రిటీలంతా మైమరిచిపోయారు.

    మత్తెక్కించే డాన్స్ పెర్ఫార్మెన్స్

    బియాన్స్ డాన్స్ పెర్మార్మెన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

    షారుక్ డాన్స్

    ఇషా అంబానీ సంగీత్ వేడుకలో షారుక్ ఖాన్ డాన్స్ పెర్ఫార్మెన్స్. తాను పెర్పార్మెన్స్ ఇవ్వడంతో పాటు పాటు ఇతరులతోనూ షారుక్ స్టెప్స్ వేయించారు.

    ఇషా-ఆనంద్

    ఇషా-ఆనంద్

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏకైక కూతురైన 27 ఏళ్ల ఇషా అంబానీ తను ప్రేమించిన 33 ఏళ్ల ఆనంద్ పిరమల్‌ను పెళ్లాడుతోంది. ముంబైలో ఈ బుధవారం వీరి వివాహం జరుగబోతోంది.

    English summary
    Mukesh Ambani and Nita Ambani's daughter Isha Ambani's wedding festivities are happening in Udaipur, Rajasthan and they are leaving no stone unturned to make it a star-studded affair. You had Hilary Clinton flying down to India for the wedding and majority of our Bollywood brigade turning up at the pre-wedding ceremonies. To add more glitter to it, the Ambanis got even Beyonce aka 'Queen B' to perform at one of the functions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X