తిరిగి సినిమాల్లో నటించడానికి స్నేహితురాలి సలహా కోరిన హీరోయిన్
లాస్ ఏంజిల్స్, జూన్ 19: హాలీవుడ్ సింగర్ బేయాన్స్ నోలెస్ తిరిగి సినిమాలలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను తన ప్రాణ స్నేహితురాలు, హీరోయిన్ అయిన గ్వినేత్ పాల్ట్రోని సలహా కోరడం జరిగింది. దీంతో గ్వినేత్ పాల్ట్రో హాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "ఆస్టన్ పవర్స్: గోల్డ్ మెంబర్" లో ఫాక్సీ క్లియోపాత్ర క్యారెక్టర్ కోసం బేయాన్స్ నోలెస్‌ని రికమెండ్ చేసింది.
ఇందు కోసం గాను గ్వినేత్ పాల్ట్రో, దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌ని కలిసేందుకు ఏర్పాటు కూడా చేసింది. దీనితో పాటు ఓ మిని మ్యూజిక్ వీడియోలో బేయాన్స్ నోలెస్‌ని నటింప జేసేందుకు సన్నాహాలు చేసింది. బేయాన్స్ నోలెస్ భర్త సింగ్ర్ జే-జడ్ తో పాటు ఇటీవలే గ్వినేత్ పాల్ట్రో, క్రిస్ మార్టిన్ కుటుంబం సరదాగా మొబైల్ హోంలో హాలీడేని ఎంజాయ్ చేశారు. ఈ సందర్బంలో బేయాన్స్ నోలెస్ తన మనసులోని మాటను బయట పెట్టింది.
జనవరిలో సింగర్ బేయోన్స్ నోలెస్ 'బ్లూ ఐవి కార్టర్' అనే పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో సినిమాలకు కాస్త విరామాన్ని ప్రకటించింది. దీంతో మళ్లీ తిరిగి సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకుంది.
ముప్పయ్యేళ్ల వయసు కలిగిన బేయాన్స్ నోలెస్ ఈ ఏడాది 'ప్రపంచంలోనే అత్యంత అందగత్తె'గా ప్రముఖ పీపుల్ మ్యాగజైన్ ఎంపికచేసింది. ఇటీవల జనవరిలో తన మొదటి బిడ్డ 'బ్లూ ఐవీ'కి జన్మను ఇచ్చిన తర్వాత బియోన్స్ నోవెల్స్ అందం మరింత పెరిగిందని పీపుల్ మ్యాగజైన్ ఎడిటర్స్ మ్యాగజైన్ వెబ్ సైట్‌లో తెలిపారు.
ఇది ఇలా ఉంటే బేయోన్స్ నోలెస్ 'ఎపిక్' అనే యానిమేషన్ చిత్రానికి బేయోన్స్ నోలెస్ తన స్వరాన్ని అప్పు ఇచ్చింది. అంటే ఈ సినిమాలో ఓ పాత్ర తన స్వరంతో మాట్లాడుతుందన్నమాట. 30 సంవత్సరాల వయసు కలిగిన ఈ రిథమ్ & బ్లూస్(R&B) సింగర్ ఎపిక్ చిత్రంలో క్వీన్ తార అనే పాత్రకు స్వరాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో బేయోన్స్ నోలెస్‌తో పాటు కోలిన్ ఫర్రేల్, అమంద సేప్రెండ్, జానీ నాక్స్విల్లే, జాసన్ సూడైకిస్, స్టీవెన్ టైలర్ మరియు జోష్ హుచర్సేన్‌లు ఉన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











