నేను ఆమెను ముద్దు మాత్రమే పెట్టుకున్నాను, ఆమెతో డేటింగ్ చేయలేదు..
టీనేజి సెన్సేషన్ జస్టిన్ బైబర్ బేబి వీడియోలో తనతో పాటు నటించినటువంటి కోస్టార్ జాస్మిన్ విల్లేజస్ తోడేటింగ్ లోపాల్గోన్నాడన్న రూమర్స్ ఇప్పుడు హాలీవడ్ లోమారు మ్రోగిపోతున్నాయి. ఈపాప్ స్టార్ ఈసంవత్సరం సెప్టెంబర్ లోకారు వెనుక సీటులో కూర్చోని తన కోస్టార్ జాస్మిన్ నుగాఢంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలు మనం అందరం చూశాం. ఈసీనుని ఆసరాగా చేసుకోని ప్రస్తుతానికి ముద్దు ఆతర్వాత ఇంకేమిటో మరి అంటూ ఓ రోమాంటిక్ లైవ్ ప్రోగ్రామ్ గావేసి జనాల్ని చూస్తారా లేదా అంటూ ప్రచురించిన విషయం తెలిసిందే.
దీనిపై జస్టిన్ బైబర్ యుయస్ న్యూస్ ఉమెన్ అయినటువంటి బార్బరా వాల్టర్స్ కుఇచ్చినటువంటి ఇంటర్యూలో అసలు విషయాన్ని చెప్పడం జరిగింది. అసలు ఆరోజు నా కోస్టార్ అయినటువంటి జాస్మిన్ విల్లేజస్ నిముద్దు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అంతకు మించి మాఇద్దరి మధ్య ఎటువంటి రోమాన్స్ జరగలేదని చెప్పారు. నాప్రక్కన ఉన్నవాళ్శు ఎవరో నన్ను ఫోటోలు తీస్తున్నారని నేను అలా కావాలని చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది అంతే. అయినా ఇదేదో పెద్ద తప్పు అన్నట్లుగా మీడియా మరీ వక్రీకరించి చూపడం నాకు ఐతే అసలు నచ్చలేదు. పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి ఏదో చెడు ఏదో ఆమాత్రం మాకు తెలియదంటారా అంటూ తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. చివరగా బార్బరా వాల్టర్స్ మీరు ఎప్పుడైనా జాస్మిన్ విల్లేజస్ తోడేటింగ్ లోపాల్గోన్నారా అని అడడగా దానికి జస్టిన్ బైబర్ నేను తనని ముద్దు పెట్టుకోవడం మాత్రమే జరిగిందని చెబుతున్నాను. అంతకు మించి తనకు నాకు ఎటువంటి శారీరక సంబంధం లేదని అన్నాడు.


Click it and Unblock the Notifications











