twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానుల కోసం మరో ఉచిత ప్రదర్శన

    By Nageswara Rao
    |

    Singer Justin Bieber
    లాస్ ఏంజిల్స్, జూన్ 13: అభిమానులకు నచ్చింది చేయడంలోనే తమకు సంతృప్తి ఉంటుందని అంటుంటారు కొంత మంది సూపర్ స్టార్స్. ఈ జాబితాలోకి తాజాగా ఇప్పుడు హాలీవుడ్ సింగింగ్ సెన్షేషన్ జస్టిన్ బైబర్ చేరాడు. 300,000 మంది అభిమానుల మధ్యలో మెక్సికోలో నిర్వహించిన ఉచిత ప్రదర్శన అభిమానులను మతి లేని వాళ్లను చేసింది.

    ఇటీవల కాలంలో జస్టిన్ బైబర్ తాను కొత్తగా రూపొందించిన ఆల్బమ్ 'బిలివ్' ప్రమోషన్‌లో భాగంగా నార్వే, ఫ్రాన్స్‌లతో పాటు వివిధ దేశాలలో తన పాటలతో ఆడిపాడి అభిమానులను అలరిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇటీవలే మెక్సికోలో షో పూర్తి చేసినప్పుడు అక్కడకు చేరిన అభిమానులను చూసి సోమవారం మెక్సికోలో మరో ప్రదర్శించేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని జస్టిన్ బైబర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

    బైబర్ తన ట్విట్టర్‌లో మెక్సికన్ సిటీలో నా ప్రదర్శనకు వచ్చిన జనాభాను చూసి నేను ఆనందపడ్డాను. నాకు నిజంగా ఇది చాలా సంతోషాన్నిచ్చింది. ఐ లవ్ యూ అంటూ ట్వీట్ చేశాడు. తనకున్న వేల మంది అభిమానులు వదిలి, తన కొత్త ట్రాక్ "బేబీ" యొక్క కూర్పును తోసిపుచ్చారు. ఈరోజు జరిగే ఈ షో నా జీవితంలో ఎంతో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది ఎమోషన్స్‌ని గమనించాను. ఇది నాకు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు.

    English summary
    Singer Justin Bieber made his fans go gaga in Mexico when he performed a free show for 300,000 people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X