మనస్పర్దల వల్ల విడిపోయిన జంట మళ్లీ కాఫీ షాప్‌లో కలిసింది..

By Nageswara Rao

జెస్సికా బెయిల్ అమెరికా మోడల్, స్టార్ హీరోయిన్. సెవెంత్ హెయిన్ అనే ఫ్యామిలీ డ్రామాలో మారీ కామ్డెన్ పాత్ర ద్వారా టెలివిజన్ అభిమానులను సంపాదించుకున్నారు. వీటితోపాటు హాలీవుడ్ సినిమాలైన సమ్మర్ క్యాచ్, ద ఎ టీమ్ లాంటి బాక్సా ఫీస్ సినిమాలలో కూడా నటించారు. సింగర్‌గా ఉన్న రోజుల్లో తన కోస్టార్ హీరో అయిన జస్టిన్ టింబర్‌లేక్‌తో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఏవో కొన్నిమనస్పర్దలు రావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మొదట్లో విడిపోడం జరిగింది.

ఐతే ఇటీవల కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు. వీరిద్దరి అక్కడ చూసిన అభిమానులు తెలిపిన దానిప్రకారం ఇద్దరూ కూడా మొదట్లో ఎలా ఐతే కలసి మెలసి ఉండే వారో అదే విధంగా వారియొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించారని సమాచారం. చాలా రోజులు తర్వాత కలుసుకున్న వీరిద్దరిలో జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా బియిల్‌ను చూస్తూ అలానే ఉండిపోవడం జరిగిందంట.

అంతేకాకుండా జస్టిన్ జెస్సికాతో మాట్లాడుతూ జీవితాంతం నీ ముఖంలో ఇలాంటి ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని వెల్లడించాడని సమాచారం. ఇది చూసిన వాళ్శంతా త్వరలోనే వీరిద్దరూ మరలా కలసి పోతారని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కలసిపోతే ఎంచక్కా డేటింగ్‌లు, పార్టీలు, పబ్‌లంటూ తిరగొచ్చునని వెటకారంగా తెలిపారు. కానీ హాలీవుడ్లో డేటింగ్ చేసుకొవడం, విడిపోవడం, మరలా కలసి పోవడం లాంటివి సర్వసాధారణం అని వారికి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X