అమితాబ్, కాటిపెర్రీ ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి కారణం
బాలీవుడ్‌లో ఆయనే నెంబర్ వన్. ఆయనతో కలసి చాలా మంది ఫోటోలు దిగాలని.. ఆయన ఆటోగ్రాఫ్ కోసం తీసుకోవాలని ఎంతో ఆసక్తితో ఉంటారు. కానీ మొట్టమొదటి సారి ఆయనే ఓ పాప్ సింగర్ ఆటోగ్రాఫ్ కోసం ఆసక్తితో ఎదురు చూశారు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ నెంబర్ వన్ అని అనుకుంటున్నారా.. ఇంకెవరూ మన బిగ్ బి అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ తన మనవరాలు నవ్య నవేలి కోసం హాలీవుడ్ పాప్ సింగర్ కాటి పెర్రీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
మంగళవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదవ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలలో సూపర్ స్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చి కవితను అభిమానులకు వినిపించిన సంగతి తెలిసిందే. కాటి పెర్రిని పాపులర్ చేసిన ఫైర్ వర్క్స్ , కాలిఫోర్నియా గర్ల్స్ పాటకు ఆడి పాడిన పెర్రీ కొద్ది సేపు మైదానంలో ఉన్న అభిమానులను ఊర్రూతలూగించారు.
కాటి పెర్రీకి అమితాబ్ మనవరాలు పెద్ద ఫ్యాన్ కావడంతో తన ఆటోగ్రాఫ్ కావాలని నన్ను అడగింది. దీంతో మనవరాలి కోరిక తీర్చే భాగంలో తానే స్వయంగా రంగంలోకి కాటి పెర్రి ఆటోగ్రాఫ్‌ని తీసుకున్నానని బిగ్ బి తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఐపిఎల్ ప్రారంభోత్సవంలో పెర్రి చేసిన ప్రదర్శన నిజంగా దేశీయ ప్రదర్శన మాదిరే ఉందని అమితాబ్ కితాబిచ్చారు. చివరకు ఐపీఎల్‌లో క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆటకు వన్నె తెస్తామని 9 జట్ల కెప్టెన్ల తరఫున అమితాబ్ బచ్చన్ ప్రతిజ్ఞ (ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ ప్లెడ్జ్) చేశారు.
సాధారణంగా హాలీవుడ్ పాప్ సింగర్స్ స్టేజీలపై ఫెర్పామెన్స్‌లు ఇచ్చేటప్పుడు వారు వేసే డ్రస్సులలో కొంచెం వల్గారిటీ కనిపిస్తుంది. కానీ ఐపిఎల్ ప్రారంభోత్సవంలో మాత్రం కాటి పెర్రి తనదైన శైలిలో నెమలి మాదిరి డ్యాన్స్ చేస్తుంటే యావత్ భారతావని పులకరించింది. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఆ కాసేపు పెర్రీ పెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేశారు.


Click it and Unblock the Notifications











