ఎంతో మందిని లైంగికంగా వేధించాడు... ఆ నటుడికి పదేళ్ల శిక్ష పడటంపై శ్రీరెడ్డి ఆనందం!
Recommended Video

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ అమెరికన్ నటుడు, అమెరికా డాడీగా గొప్ప పేరు తెచ్చుకున్న బిల్ కాస్బీకి పదేళ్ల శిక్ష పడింది. మహిళపై మాదక ద్రవ్యాలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బిల్ కాస్పీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి కొనసాగిన ఈ కేసులో ఎట్టకేలకు పెన్విల్వేనియా కోర్టు తీర్పు వెలువరించింది. మహిళలపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో అలాంటి వేధింపులకు గురైన వారు #మీటూ కాంపెయిన్ మొదలు పెట్టిన తర్వాత శిక్ష పడ్డ తొలి సెలబ్రిటీగా బిల్ కాస్పీ వార్తల్లోకి ఎక్కాడు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

2004లో కేసు వేస్తే...
2004లో ఆండ్రియా కాన్‌స్టాండ్ అనే నటికి మాదక ద్రవ్యాలు ఇచ్చి, ఆమెను శారీరకంగా వేధించినట్లు కోస్బీపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో అతడు నిర్దోషిగా బయట పడ్డాడు. అదే కేసు వివిధ మలుపు తిరిగి ఎట్టకేలకు బిల్ కాస్పీకి శిక్ష పడేలా చేసింది.

ఇష్ట పూర్వకంగా శృంగారంలో పాల్గొరని వాదన
అయితే తనపై ఆరోపణలు చేసిన వారంతా వారి ఇష్టపూర్వకంగానే తనతో శృంగారంలో పాల్గొన్నారంటూ బిల్ కాస్పీ వాదిస్తూ వచ్చారు. చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది అన్నట్లు బిల్ కాస్పీ పాపం ఇప్పటికి పండిందని శిక్ష ఖరారైన అనంతరం పలువురు అభిప్రాయ పడుతున్నారు.

అనేక మంది మహిళలు
ఆండ్రియా కాన్‌స్టాండ్ తర్వాత అనేక మంది బిల్ కాస్పీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2014లో జరిగిన ఓ కార్యక్రమానికి బిల్ హాజరైనప్పుడు హాన్నిబాల్ బ్యూరెస్ అనే యువతి స్టేజ్‌పైకి వచ్చి ‘బిల్ రేపిస్ట్' అంటూ అరిచింది. ఆ సమయంలో మరో 60 మంది మహిళలు సైతం బిల్ కామాంధుడంటూ మీడియా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు.

బెయిల్ కూడా నిరాకరణ
81 ఏళ్ల బిల్ కాస్పీపై వచ్చిన లైంగిక ఆరోపణలు పరిశీలించిన మాంట్‌గోమేరీ కౌంటీ జడ్జి అతడికి పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాదు బెయిల్ ఇవ్వడానికి కూడా న్యాయ స్థానం నిరాకరించింది.

శ్రీరెడ్డి ఆనందం
కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేసిన శ్రీరెడ్డి..... బిల్ కాస్పీకి శిక్ష పడటంపై ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. కమెడియన్‌కు పదేళ్ల జైలు శిక్ష... #మీటూ కాంపెయిన్ మొదలైన తర్వాత శిక్షపడ్డ తొలి సెలబ్రిటీ అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











