ఆస్కార్ బరిలో రేసులో ముందున్న ఆర్టిస్ట్
ఫన్నీ మ్యాన్ 63 సంవత్సరాల వయసు కలిగిన 'బిల్లీ క్రిస్టెల్' ఫిబ్రవరి 26 (ఆదివారం) నాడు తొమ్మిదోసారి ఆస్కార్స్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వీక్షించనున్న ఈ అకాడమీ అవార్డుల కార్యక్రమానికి తాను హోస్ట్‌గా వ్యవహారించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక 2012 ఉత్తమ చిత్రం విభాగంలో ది ఆర్టిస్ట్, హ్యూగో, ది డిసెండెంట్స్, ఎక్స్‌ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇన్ క్రెడిబ్లీ క్లోజ్, ది హెల్ప్, మనీ బాల్, వార్ హార్స్, మిడ్‌నైట్ ఇన్ ఫారిస్, ది ట్రీ ఆఫ్ లైప్ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
పైన పేర్కోన్న అన్ని చిత్రాలలో కెల్లా ఈ సంవత్సరం 'ది ఆర్టిస్ట్' సినిమా పైనే అందరి చూపులు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో సినిమా రంగంలో కలప్ పుల్‌తో అలరిస్తుంటే ఈ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో విడులై బాక్సాపీసు రికార్డుల్ని సృష్టించడమే కాకుండా అద్బుతమైన ప్రక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇక సినిమా కధ విషయానికి వస్తే 1927 నుండి 1932 నేపధ్యంలో ఓ సీనియర్ నటుడు, యువ హీరోయిన్ మద్య ఉండే అనుబంధం మీద ఈ చిత్రం సాగుతుంది. మొత్తం 24 విభాగాల్లో దాదాపు తొమ్మిది విభాగాల్లో ఆస్కార్ నామినేషన్‌ని సాధించింది. ఉత్తమ చిత్రంగా కూడా దీనికే అవార్డు వస్తుందని కొంత మంది హాలీవుడ్ నిపుణులు జోస్యం చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











