»   » విమానంలో వీరంగం సృష్టించిన టీవీ స్టార్ ప్రియురాలు

విమానంలో వీరంగం సృష్టించిన టీవీ స్టార్ ప్రియురాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టీవీ స్టార్ రాబ్ కర్దాషియాన్ ప్రియురాలు బ్లక్ చీనాను అస్టిన్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసారు. తాగిన మత్తులో విమానంలో నానా హంగా సృష్టించడమే ఇందుకు కారణం. బాగా మద్యం సేవించిన ఆమె విమానంలో యుద్ధవాతవరణం సృష్టించిందని, తోటీ ప్రయాణీకులతో బాహాబాహీకి దిగిందని, అందుకే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

BLAC CHYNA ARRESTED AT AUSTIN AIRPORT

అమెరికాలో పేరుమోసిన మోడల్ అయిన బ్లక్ చీనా ఇటీవల లాక్స్ నుండి డెల్టా విమానంలో లండన్ ప్రయాణమైంది. తాగిన మత్తులో ఆమె చేసిన పనికి విమానాన్ని ఆస్టిన్ లో ల్యాండ్ చేసారు. వెంటనటే ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను తోటీ ప్రయాణీకులు భయానక అనుభవంగా పేర్కొన్నారు.

విమానంలో మాత్రమే కాదు.... ఆమెను అరెస్టు చేసే సమయంలోనూ బ్లక్ చీనా తన ప్రతాపం చూపింది. పోలీసులపై నోరు పారేసుకుంది. విమానాశ్రయం దద్దరిల్లేలా గోల చేసింది. ఈ మోడల్ చేసిన గలాటా చూసి విమానాశ్రయంలో ఇతర ప్రయాణీకులు, బద్రత సిబ్బంది విస్తుపోయారు.

English summary
Blac Chyna was arrested Friday after allegedly getting drunk and becoming belligerent during a trip to London.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu