అతను బ్రతకడని తెలిసినా పెళ్లి చేసుకున్న ప్రేయసి.. బ్లాక్ పాంథర్ హీరో రియల్ లవ్ స్టొరీ

2020లో సినీ ప్రపంచంలో మర్చిపోలేని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హాలీవుడ్ స్టార్ హీరో చాడ్విక్ బోస్మాన్ ఇటీవల హఠాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని మరింత షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అభిమానులనే కాకుండా ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా అతని మరణం తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అయితే అతని రియల్ లైఫ్ లవ్ స్టొరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

Black Panther Star Chadwick Boseman హఠాన్మరణం, సినీ లోకానికి మరో బిగ్గెస్ట్ షాక్ ! | Oneindia Telugu

"బ్లాక్ పాంథర్" ద్వారా భారీ క్రేజ్..

"బ్లాక్ పాంథర్" సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం వ్యాప్తంగా ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు స్టార్ చాడ్విక్ బోస్మాన్. గత కొంతకాలంగా అతను క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇక చివరకు ప్రాణాలు విడిచాడు. ఈ నటుడు పెద్దప్రేగు క్యాన్సర్‌ తో గత నాలుగేళ్ళ నుంచి ఒక యుద్ధమే చేస్తున్నాడు.

క్యాన్సర్ తోనే షూటింగ్స్..

క్యాన్సర్ తోనే షూటింగ్స్..

నిజంగా అతనికి క్యాన్సర్ ఉందని కనీసం దగ్గర బంధువులకు కూడా తెలియదు. గుండెలో అంత బాధని పెట్టుకొని చాడ్విక్ నిత్యం నవ్వుతున్న మొహంతోనే కనిపించేవాడు. భయంకరమైన రోగాన్ని కడుపులో పెట్టుకొని రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ ని పూర్తి చేశారు. మరోవైపు రెగ్యులర్ చికిత్స కోసం తన పర్సనల్ వైద్యులను సంప్రదిస్తూ ఉండేవాడు.

బ్రతుకుమీద చిన్న ఆశ...

బ్రతుకుమీద చిన్న ఆశ...

ఎంత ప్రయత్నం చేసినా కూడా లాభం ఉండదని చాడ్విక్ కి క్లియర్ గా అర్దమయ్యింది. కానీ ఎక్కడో ఒక చోట బ్రతుకుమీద చిన్న ఆశ బలంగా ఉంది. ఇక చాడ్విక్ తన చిరకాల ప్రేయసి అయిన సింగర్ సైమోన్ టైలర్ ని గత ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్నాడు. అయితే అంతకుముందే వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

చనిపోతాడాని తేలిసిన..

చనిపోతాడాని తేలిసిన..

ఇక సైమోన్ టైలర్ కూడా చాడ్విక్ త్వరగానే కొలుకుంటాడని వెయిట్ చేసింది. కానీ ఫలితం దక్కలేదు. అతను ఎదో ఒక విధంగా జబ్బు పడు హాస్పిటల్ పాలవుతుండడంతో సైమోన్ 2019 అక్టోబర్ లో వివాహం చేసుకుంది. అతను చనిపోతాడాని తెలిసినా కూడా ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా అతను తుది శ్వాస విడిచే వరకు కూడా సైమోన్ పక్కనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X