చారిత్రాత్మక షోలో ఆ సెక్సీ బ్యూటీనే సెలెక్ట్ చేశారు
బ్లేక్ లివ్‌లీ అమెరికన్ స్టార్ హీరోయిన్, మోడల్. 'గాసిప్ గర్ల్' టెలివిజన్ డ్రామా సిరిస్ ద్వారా యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అమెరికన్ హీరోయిన్లలలో ఒకరు. ప్రస్తుతం బ్లేక్ లివ్‌లీ 'సావేజస్' అనే సినిమా షూటింగ్‌లో లాస్ ఏంజిల్స్‌లో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రముఖ అమెరికా కేబుల్ టెలివిజన్ సిరిస్ అయిన సెక్స్ అండే ద సిటీ షోలో త్వరలో బ్లేక్ లివ్‌లీ పాల్గోనున్నారని సమాచారం.
సెక్స్ అండ్ ద సిటీ గురించి తెలుసుకొవాలంటే ఇదోక టివి షో. ఈ టీవి షోలో సెక్సుకు సంబంధించిన రోగాల గురించి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారు. ఈ సెక్స్ అండ్ ద సిటీ కార్యక్రమాన్ని హెచ్‌బివో ఛానల్ 1998 నుండి 2004 వరకు దాదాపు 94 ఎపిసోడ్స్‌గా ప్రసారం చేసింది. ఈ సెక్స్ అండ్ ద సిటి షో కి సంబంధించిన మొత్తం షూటింగ్‌ని కూడా న్యూయార్క్‌లో ఉన్న సిల్వర్ కప్ స్టూడియోలో తీయడం జరుగుతుంది. 2007వ సంవత్సరంలో ఈ సెక్స్ అండ్ ద సిటి టివి షో టాప్ 100 బెస్ట్ టివి షోలలో ఒకటిగా టైమ్స్ మ్యాగజైన్ లో ప్రచురించబడింది.
త్వరలో ప్రారంభం కానున్న ఈ సెక్స్ అండ్ ది సిటి 2 టివి షోలో తన అందాలతో బ్లేక్ లివ్‌లీ అలరించనుంది. సెక్స్ అండ్ ది సిటీలో బ్లేక్ లివ్‌లీ నటించాలని అభిమానులు కూడా తెగ ఊవిళ్శు ఊరుతున్నారు.


Click it and Unblock the Notifications











