'బాత్‌టబ్' లో కిక్ ఎక్కించే రొమాన్స్ చేసిన గాసిప్ గర్ల్
బ్లేక్ లివ్‌లీ అమెరికన్ స్టార్ హీరోయిన్, మోడల్. 'గాసిప్ గర్ల్' టెలివిజన్ డ్రామా సిరిస్ ద్వారా యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అమెరికన్ హీరోయిన్లలలో ఒకరు. ప్రస్తుతం బ్లేక్ లివ్‌లీ 'సావేజస్' అనే సినిమా షూటింగ్‌లో లాస్ ఏంజిల్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బ్లేక్ లివ్‌లీ నటించిన రొమాన్స్ సీన్లు హాలీవుడ్‌లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ని విడుదల చేశారు.
సావేజస్ సినిమాలో బ్లేక్ లైవిలీ మాన్ హాట్టన్ సిటీలో నివసించే హై సోసైటీ గర్ల్ పాత్రలో ఒదిగిపోయిందని సినిమా విశ్లేషకులు తెలిపారు. హిప్పీ గర్ల్ గా బ్లేక్ లివ్‌లీ చేసిన నటన అమోఘం. సినిమా ట్రైలర్‌లో బ్లేక్ లివ్‌లీ ఇద్దరు డ్రగ్ డీలర్స్‌తో డేటింగ్ చేసే సన్నివేశాలు బాగా వచ్చాయని దర్శకుడు తెలిపారు. డ్రగ్ డీలర్స్ పాత్రలలో ఆరోన్ జాన్సన్, టేలర్ నటించారు.
ఈ ప్రక్క చిత్రాన్ని గనుక గమనించినట్లైతే బ్లేక్ లైవిలీ రెచ్చిపోయి మరీ తన కోస్టార్‌కు టబ్‌లో ఎలా ముద్దు పెడుతుందో చూడోచ్చు. ఈ చిత్రంలో తన అండర్ వేర్ కనిపిస్తున్నా చూసుకోకుండా మైమరచిపోయి మరీ యాక్టింగ్ చేసింది. ఈ సినిమాలో బ్లేక్ లైవిలీ నటించిన కొన్ని సన్నివేశాలలో ఎటువంటి ఇబ్బందికి లోనుకాకుండా తనదైన శైలిలో నటించింది. 24 సంవత్సరాల వయసు కలిగిన బ్లేక్ లైవిలీ గాసిప్ గర్ల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.
సావేజస్ సినిమాలో బ్లేక్ లైవిలీ పోషించిన పాత్ర పేరు ఒఫేలియా. ఆమె తన ఇద్దరు ప్రేమికులు బెన్, ఛాన్‌లతో లగ్జరీగా ఎలా గడుపుతుందో ముఖ్య కథాంశంగా సాగుతుంది. ఈ సినిమాని ఈ వేసవిలో విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications











