twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన ఆధ్యాత్మక చింతన నాపై ప్రభావం.. !

    By Nageswara Rao
    |

    ఆస్ట్రేలియా ప్రముఖ మోడల్ మిరందా కెర్, తన భర్త ఓర్నాల్డ్ బ్లూమ్ తన వివాహం ఆనందించే విషయంగా ఉండండతో పాటు ఓర్నాల్డ్ బ్లూమ్ యొక్క ఆధ్యాత్మిక సాధన ఆమె మీద ఒక మంచి ప్రభావాన్ని చూపుతుందని ఆస్టేలియన్ డిపార్ట్‌మెంట్ డేవిడ్ జోన్స్‌కి ప్రమోషన్‌లో భాగంగా నిన్న రాత్రి సిడ్నీలో ఇచ్చిన ఫ్యాషన్ షోలో తెలిపింది. 28 సంవత్సరాల వయసు కలిగిన మిరందా కెర్ వింటర్ కలెక్షన్స్‌కి సంబంధించిన పలు రకాల డిజైన్స్‌ని ప్రదర్శించడమే కాకుండా తన హోయలతో అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది.

    ఈ ప్రదర్శన అయిన అనంతరం మిరందా కెర్ మాట్లాడుతూ డేవిడ్ జోన్స్ స్టోర్‌కి ఎప్పుడు ప్రదర్శన ఇచ్చినా నేను నా సొంత సంస్దలాగా భావిస్తాను. ఇక్కడికి వచ్చిన గెస్టులు, అతిధులు సేమ్ లెవెల్‌లో కూర్చున్నప్పటికీ.. షో చేయడం మాకు ఇబ్బందిగా లేదు. న్యూయార్క్, పారిస్‌లలో షో చేసిన అనుభూతిని కలిగింది. ఇక బ్లూమ్‌తో తన జీవితాన్ని వెల్లడిస్తూ మూడు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత నేను బ్లూమ్ జూలై 2010లో పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మా ఇద్దరి డేటింగ్ మూలాన మాకు 12 నెలల ఫ్లిన్ కలిగాడు.

    ఒక జంటగా మేమిద్దరం జీవితాన్ని చాలా ఆనందంగా గడపడమే కాకుండా.. బ్లూమ్ ఎక్కువ ఆధ్యాత్మిక సేవలో ఉండడం మా ఇద్దరి మద్య మంచి సంబంధాన్ని ఉంచుతుందని నేను భావిస్తున్నాను. ఇక ఫ్లిన్ గురించి చెప్పాలంటే ఇప్పుడిప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు మాదిరి ఉన్నాడు. ఫ్లిన్ అందంగా, ప్రియమైన బాలుడు. మే ముగ్గురం ఒకే చోట కలసి ఉండలేక పోతున్నాం. అందుకు కారణం బిజీ, బిజీ షెడ్యూల్స్ వల్ల ఎప్పుడూ ప్రయాణాలతోనే సరిపెడుతున్నాం. నా చుట్టూ నా కుటుంబం(ఫ్లిన్, బ్లూమ్) ఉన్నంత వరకూ నేను చాలా ఆనందంగా ఉంటాను.

    English summary
    Australian model Miranda Kerr is enjoying her marriage to Orlando Bloom and says her husband’s spiritual practice is a positive influence on her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X