For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘వండర్ ఉమెన్’ ఫేం నటితో రొమాన్స్ చేయబోతున్న ఇండియన్ నటుడు

|

ఇండియన్ యాక్టర్ అలీ ఫజల్ మరో బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. హాలీవుడ్ చిత్రం 'విక్టోరియా అండ్ అబ్దుల్'లో చివరిసారిగా కనిపించిన అలీ ఫజల్ మరో హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సారి 'వండర్ ఉమెన్' ఫేం, హాలీవుడ్ నటి గాల్ గాడోట్‌తో రొమాన్స్ చేయబోతున్నాడు.

అగాథ క్రిస్టీ రాసిన నవల 'డెత్ ఆన్ ది నైలు' ఆధారంగా రూపొందబోయే చిత్రంలో గాల్ గాడోట్, అలీ ఫజల్ కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రానికి కెన్నెత్ బ్రానాగ్ దర్శకత్వం వహించనున్నారు. కెన్నెత్ మొదటి చిత్రం థోర్ సిరీస్, హామ్లెట్, యాస్ యు లైక్ ఇట్, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్‌తో సహా చాలా ప్రజాదరణ పొందిన, విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Bollywood actor Ali Fazal signed as lead for movie opposite Gal Gadot

తను చేయబోయే రెండో హాలీవుడ్ చిత్రానికి సంబంధించిన వార్తను అలీ ధృవీకరించారు. "అవును నేను ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగంకాబోతున్నాను, త్వరలోనే సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నాను. మా అమ్మ, నేను అగాథ క్రిస్టీ రాసిన నవలలకు పెద్ద అభిమానులం'' అని తెలిపారు.

నైలు నదిలో క్రూయిజ్ షిప్‌లో జరిగే కొన్ని మిస్టీరియస్ సంఘటనలపై హెర్క్యులే పైరోట్ చేసిన దర్యాప్తు గురించి ఈ చిత్ర సాగుతుంది. ఒక హత్య కేసు దర్యాప్తు జరుగుతుండగా జరిగిన కొన్ని ఊహించని సంఘటనలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలుస్తోంది.

ఈ చిత్రం 20వ సెంచరీ ఫాక్స్ సిరీస్‌లో భాగం, ఇంతకు ముందు మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లు సాధించింది. డెత్ ఆన్ ది నైలు గతంలో 1978లో రూపొందింది. ఇందులో బెట్టే డేవిస్, మాగీ స్మిత్, మియా ఫారో లాంటి దిగ్గజాలు నటించారు.

English summary
Bollywood actor Ali Fazal signed as lead for movie opposite Gal Gadot. The duo is set to star in the on-screen modern-day adaptation of Agatha Christie’s novel Death on the Nile and is set be directed by Kenneth Branagh.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more