జేమ్స్ బాండ్ 25వ చిత్రం టైటిల్ ‘నో టైమ్ టు డై’

ఈ ప్రపంచానికి యాక్షన్ సీన్ల రుచి ఎలా ఉంటుందో పరిచయం చేసింది జేమ్స్ బాండ్ సినిమాలే అని చెప్పక తప్పదు. అందుకే ఈ ప్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. త్వరలో 25వ బాండ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జేమ్స్ బాండ్ 25వ చిత్రానికి టైటల్ ఖరారైంది. 'నో టైమ్ టు డై' పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కారీ ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్, 2020లో ప్రేక్షకుల రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర నిర్మాతలు ట్వీట్ చేశారు.

Bond 25 movie titled as NO TIME TO DIE

ఇది డేనియల్ క్రెయిగ్ చేస్తున్న 5వ, చివరి బాండ్ మూవీ. 2006లో వచ్చిన కాసినో రాయల్‍‌తో బాండ్ హీరోగా పరిచయమైన డేనియల్ క్రెయిగ్ ఆ తర్వాత క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008), స్కైఫాల్(2012), స్పెక్టర్(2015) చిత్రాల్లో నటించాడు.

'నో టైమ్ టు డై'లో డేనియల్ క్రెయిగ్ హీరోగా నటిస్తుండగా..., రామి మాలెక్‌ మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. వీరితో పాటు బాండ్ సుపీరియర్ ఆఫీసర్, ఎంఐ6 హెడ్ 'ఎం' పాత్రలో రాల్ఫ్ ఫీనెస్, నామి హారిస్, రోరే కిన్నియర్, లెయా సెడౌక్స్, బెన్ విషా, జెఫ్రీ రైట్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలను మించిన బడ్జెట్ ఈ మూవీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఊహకు అందని అద్భుతమైన స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే విధంగా ఉండబోతున్నాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X