twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్ బాండ్ 25పై ఎట్టకేలకు క్లారిటీ...హీరోగా అతడే, విలన్ పాతలో ఎవరంటే?

    |

    ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూసే చిత్రాల్లో జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలు ప్రత్యేకమైనవి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 25వ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సారి బాండ్ పాత్రలో డేనియర్ క్రెయిగ్ నటించడం లేదనే వార్తలు హల్‌చల్ చేశాయి.

    ఎట్టకేలకు బాండ్ 25పై క్లారిటీ వచ్చింది. ఇందులో డేనియర్ క్రెయిగ్ మరోసారి ఏజెంట్ 007గా కనిపించబోతున్నాడు. అస్కార్ అవార్డ్ విన్నర్ రామి మాలెక్ మెయిన్ విలన్ పాత్రలో అలరించబోతున్నాడు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖారారు కావాల్సి ఉంది.

    జేమ్స్ బాండ్ 25

    క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా మొదట ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన డానీ బోయెల్ తప్పుకోవడంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇపుడు ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు కారీ జోజి ఫుకునాగ చేపట్టారు. సినిమాకు సంబంధించిన ముఖ్యతారాగణం ఎంపికవ్వడంతో పాటు జమైకాలో షూటింగ్ కూడా మొదలైంది. ఏప్రిల్ 8, 2020 నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

    హీరోగా డేనియల్ క్రెయిగ్, విలన్ పాత్రలో రామి మాలెక్

    డేనియల్ క్రెయిగ్, రామి మాలెక్‌తో పాటు ఇతర పాత్రల్లో నటించే వారి వివరాలు సైతం ప్రకటించారు. బాండ్ సుపీరియర్ ఆఫీసర్, ఎంఐ6 హెడ్ ‘ఎం' పాత్రలో రాల్ఫ్ ఫీనెస్ నటించబోతున్నారు. ఇంకా నామి హారిస్, రోరే కిన్నియర్, లెయా సెడౌక్స్, బెన్ విషా, జెఫ్రీ రైట్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఇదే అతిపెద్ద బాండ్ మూవీ

    బాండ్ సీరిస్‌లో వస్తున్న 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలను మించిన బడ్జెట్ ఈ మూవీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఊహకు అందని అద్భుతమైన స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే విధంగా ఉండబోతున్నాయట.

    కొత్త డైరెక్టర్

    కొత్త డైరెక్టర్

    బాండ్ మూవీ కొత్త డైరెక్టర్ కారీ జోజి ఫుకునాగా గురించిన విషయాల్లొకి వెళితే... జులై 10, 1977లో కాలిఫోర్నియాలోని అలమేడాలో జన్మించాడు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన టీచ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫిల్మ్ ప్రోగ్రామింగ్ కోర్స్ కంప్లీట్ చేశాడు. కారీ జోజి ఫుకునాగా కేవలం దర్శకుడు మాత్రమే కాదు రచయిత, నిర్మాత, సినిమాటోగ్రాఫర్ కూడా. 2009లో వచ్చిన 'సిన్ నంబ్రే' అతడికి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. దీంతో పాటు ట్రూ డిటెక్టివ్, మేనియాక్, జేన్ ఐరే చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

    English summary
    Bond 25 movie total details out. Daniel Craig will be reprising his role of Bond whereas, the Academy Award-winning actor, Rami Malek will play the main villain in the feature.At the recently held live event at Ian Fleming's GoldenEye villa in Jamaica, movie experts and fans learned several interesting things about the upcoming Bond 25 movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X