»   » ముస్లిం మహిళలను రేప్ చేయడమా.. మామనో భావాలను దెబ్బతీస్తుంది..

ముస్లిం మహిళలను రేప్ చేయడమా.. మామనో భావాలను దెబ్బతీస్తుంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజిలీనా జోలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న వివాదాల్లో చిక్కుకుంది. గతంలో ఐక్యరాజ్య సమితి బ్రాండ్ అంబాసిడర్ గాఏంజిలీనా జోలి చెప్పిన విధంగా బోస్నియా యుద్దంలో నష్టపోయిన కుటుంబాలకు తనవంతు సహాయంగా విరాళాలు ప్రకటించి, వారిజీవితాలు ఎంత దుర్బరంగా ఉన్నాయో యావత్ ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికి వారిజీవితాలు ఆధారం చేసుకోని సినిమా తీస్తానని అన్న జోలి, చెప్పిన విధంగానే సినిమా తీసి వివాదంలో చిక్కుకుంది.

ఆ వివాదం ఏమిటంటే గతంలో జరిగినటువంటి బోస్నియా యుద్ద సమయంలో కోందరు ముస్లిం మహిళలు అత్యాచారాలకు గురిఅయ్యారని తెలుసుకున్న జోలి వారిజీవితంగా ఈసినిమాలో ముస్లిం మహిళ పాత్రను పోషించింది. అంతేకాకుండా సినిమా కధ విషయానికి వచ్చేసరికే ముస్లిం మహిళ మరియు సెర్బ్ మనిషికి మధ్య జరిగే ఓ చక్కటిరోమాన్స్ స్టోరీగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యుద్ద సమయంలో కారాగారంలో ఉన్న సెర్బ్ గార్డుకి ముస్లిం మహిళ ఇద్దరూ ఏవిధంగా ప్రేమలో పడ్డారనే చక్కని కధాంశంతో సినిమాని రూపోందిస్తున్నారు. అంతేకాకుండా యుద్ద సమయంలో చాలా మంది బోస్నియా నగరంలో ఉన్న ముస్లిం మహిళలు మీద ఏవిధంగా అత్యాచారాలు మరియు రేప్ చేశారనేది కూడా చాలా చక్కగా రూపోందిస్తున్నామని గతంలో జోలి అన్నారు.

ఇప్పుడు సినిమా చాలాభాగం కంప్లీట్ అయ్యిన సమయంలో ఉమెన్ విక్టిమ్స్ అఫ్ వార్ వారు ఏంజిలీనా జోలి మీద కోన్ని ఆంక్షలు విధంచడానికి రంగం సిద్ధం చేశారు. దీనికి స్పందించినటువంటి ఏంజిలీనా జోలి గతంలోనే నేను ఉమెన్ విక్టిమ్స్ అఫ్ వార్ అధినేత బకీరా హాసిసిక్ నుకలసి బోస్నియా యుద్దంలో నష్టపోయినటువంటి మహిళలను కలవాలని కోరినప్పుడు, ఆయన అందుకోసం నాకు హాంగేరిలో ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటుచేసినప్పుటికీ అక్కడున్న ప్రజలు ఎవరూ రాలేదు. దాంతో నేనే హాంగేరిలోని ప్రతి ఒక్కరిని కలసి బోస్నియా యుద్దం గురించి తెలుసుకోవడం జరిగిందని వివరించారు. ఆతర్వాతే నేను షూటింగ్ నుమొదలు పెట్టడం జరిగిందని వివరించారు. ఐతే దీనిపై కూడా ఉమెన్ విక్టిమ్స్ అఫ్ వార్ ఐక్యరాజ్యసమితి కూడా ఓలేఖ రాయడం జరిగింది. దీనిపై వారిస్పందన ఎలాగ ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu