అతడి సేవలను మరువతరం కాదు- బాయ్ జోన్

By Kuladeep

'బాయ్ జోన్' బ్యాండ్ సభ్యుడు దివంగత స్టిఫెన్ గ్యాట్లీ సేవలను మరువతరం కాదని బాయ్ జోన్ బ్యాండ్ సభ్యుడు షేన్ ఫిలన్ తెలిపారు. ఇటీవల జరిగిన 'బాయ్ జోన్' బ్యాన్ పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఈ బ్యాండ్ సభ్యులు తమ స్నేహితుడు స్టిఫెన్ ను గుర్తుచేసుకున్నారు. బాయ్ జోన్ కోసం అందరం కలసి ఎంతో కష్టపడ్డామని, అందులో స్టిఫెన్ సేవలు మరువలేనిదని, అలాంటి మిత్రుడు ప్రస్తుతం తమ మధ్య లేకపోవడం చాలా బాధిస్తోందని తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

33 ఏళ్ల గ్యాట్లీ అక్టోబరు 10వ తేదీన స్పెయిన్ లోని తన ఇంట్లో విగతజీవుడై పడి వుండటం తెలిసిందే. అతిగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. కాగా గ్యాట్లీ ఆస్తులకి సంబంధించిన విల్లు కనిపించడం లేదట. దీనిపై అతని భాగస్వామి లబోదిబోమంటున్నాడు. లండన్ కు చెందన ఓ కంపెనీలో తన ఆస్తుల పెట్టుబడి పెట్టాడని, కానీ సదురు కంపెనీ వివరాలు తెలియకపోవడంతో, విల్లు ఆచూకీ తెలియకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఆయన వాపోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X