ఎంజలీనా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందా???
హాలీవుడ్ నటీమణి ఎంజలీనా జోలీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందా?? అవుననే అంటోంది హాలీవుడ్. ఇటీవలే ల్యాన్ రాసిన ఓ పుస్తకం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఎదో సినిమా కథలో చూపినట్టు తమ జీవితం గడచిపోవాలని వారు అనాధలను దత్తతకు తీసుకొంటూ తమ కుంటుబాన్ని విస్తరిస్తూపోతున్నారు కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో బ్రాడ్, ఏంజలీనా విడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి?? అన్న ప్రశ్నను లేవనెత్తింది.
అంతే కాకుండా బ్రాడ్ పిట్ ఇంతకు ముందు జెన్నిఫర్ అనిస్టాన్ ను పెళ్లి చేసుకొని విడిపోవడం, అందుకు గల కారణాలను కూడా వివరించింది. అంతే కాకుండా ప్రస్తావించాడానికి ఇబ్బందిగా అనిపించేలా ఏంజలీనా గత జీవిత అనుభవాలు, ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటనలు, ఆ తర్వాత ఆస్కార్ అవార్డు విజేతగా నిలబడటం లాంటివి ప్రస్తావిస్తూ వీరి వ్యక్తిగత జీవితం పెరుగుతున్న వారి కుంటుంబం పై ప్రభావం చూపుతుందనే విషయాన్ని వివరించారు సదురు పుస్తకంలో...దీనిపై హాలీవుడ్ లో తలో కమెంట్ చేసుకుంటున్నారట....


Click it and Unblock the Notifications











