తల్లి దండ్రులుగా కవలలను ఆహ్వానించనున్న సూపర్ స్టార్

By Nageswara Rao

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ మరియు బ్రాడ్ పిట్ గత కొన్ని సంవత్సరాలుగా కలసి సహాజీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు వీరిద్దరూ త్వరలో వివాహాం చేసుకోబోతున్నారనే రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఐతే హాలీవుడ్‌లో సంచరిస్తున్న నివేదిక ప్రకారం శరదృతువుకి ముందే వీరిద్దరూ వివాహాం చేసుకునేందుకు అన్ని రకాలుగా సిద్దపడ్డారని సమాచారం.

ఐతే త్వరలో ఏంజీలీనా జోలీ కవలలకు జన్మనిస్తుందని పుకారు రావడంతో పిల్లలు కనడానికి ముందే వివాహాం చేసుకోవాలని అనుంటున్నారంట.
జోలీ కూడా కవలలనే భావిస్తున్నారు, కనుక ఈ సమయాన్ని జోలీ అత్యంత క్లిష్టమైన సమయంగా భావిస్తున్నారు. వీరిద్దరూ భార్య, భర్తలుగా కవలలను ప్రపంచంలోకి స్వాగతంచాలని నిర్ణయించుకున్నారంట. దీనిని దృష్టిలో పెట్టుకునే త్వరలో వివాహానికి సన్నాహాలు చేస్తున్నారంట.

ఇది ఇలా ఉంటే ఏంజిలీనా జోలీ(36), బ్రాడ్ పిట్(48) సంవత్సరాల వయసు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఆరుగురు పిల్లలకు తల్లి దండ్రులుగా వ్యవహారిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డ్స్‌కి ఇద్దరూ కలసి సంయుక్తంగా హాజరైన తర్వాతే వారి మదిలో వివాహాం చేసుకోవాలని ఆలోచన వచ్చినట్లు జోలీ ప్రతినిధి తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X