నేను ఇప్పుడు ఓ ఓల్డ్ మ్యాన్.. సూపర్ స్టార్ కాదు
హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ తనకు తానే నేనో ముసలి వాడినని అభివర్ణించాడు. 48 సంవత్సరాల వయసు కలిగిన ఈ సూపర్ హీరో మూడు ఏళ్ల వయసు కలిగిన తన కుమార్తె వివియన్నే ని చేతులతో పట్టుకోని మద్దాడుతూ కొండ మీద నుండి దిగుతుండగా కాలు జారి క్రింద పడడం వల్ల మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కూతురు వివియన్నేకి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
ప్రస్తుతం కర్రని ఉపయోగించి నడుస్తున్న బ్రాడ్ పిట్ ఈ సంఘటనపై తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి సంఘటనలు జీవితంలో సహాజం అని అన్నారు. అంతేకాకుండా ఈ సంఘటన జీవితం లేదా మరణానికి సంబంధించినదని అన్నారు. ఇటీవల జరిగిన '23వ ఫామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గాలా'కి కర్రతో వచ్చిన బ్రాడ్‌పిట్, మీడియా వారితో మాట్లాడుతూ ఈ సంఘటను చాపు, బ్రతుకుకి సంబంధించినది కాదని అన్నారు.
48 సంవత్సరాల వయసు లో ఉన్న ఓ ముసలి వాడు కాలు జారి క్రింద పడ్డాడని అన్నారు. ఈ వాటర్ ఫాల్ హౌస్‌ని బ్రాడ్ పిట్ పుట్టిన రోజు కానుకగా ప్రేమను తెలిపేందుకు గాను ఏంజిలీనా జోలీ గిప్ట్‌గా ఇచ్చింది. ఈ వాటర్ ఫాల్ హౌస్ సమీపంలోనే ఈ సంఘటన సంభవించింది.


Click it and Unblock the Notifications











