twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ స్టార్ జంట విడిపోనుందా??

    By Kuladeep
    |

    హాలీవుడ్ హాట్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు త్వరలో విడిపోనున్నారా?? అవుననే అంటున్నాడు ప్రముఖ రచయిత లాన్ హాల్పెరిన్. హాల్పెరిన్ ఈ స్టార్ జంట గురించి రాసిన పుస్తకం 'బ్రాంజెలీనా' లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసాడు. మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఆ తర్వాత సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా వున్న వీరిద్దరూ ఆ తర్వాత తరచుగా గొడవ పడుతూ వుండేవారని హాల్పెరిన్ 'బ్రాంజెలీనా' పుస్తకంలో రాసాడు. వీరిద్దరూ ప్రస్తుత రాజకీయాల గురించి, తమ పిల్లల దుస్తుల విషయంలో, బ్రాండ్ పిట్ తాగుడు గురించి ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతూ వుండేవారని 'బ్రాంజెలీనా' లో రాసారు.

    కాగా వీరిద్దరి భంధం గురించి హాల్పెరిన్ బ్రాడ్ కుటుంబ సభ్యులను విచారించగా చాలా మంది వీరిద్దరూ విడిపోవాలని కోరుకున్నారట. వారంతా బ్రాడ్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. కాగా ఏంజలీనా, బ్రాడ్ ల కారు డ్రైవర్ ను విచారించినప్పుడు ఆయన వారిద్దరూ తరచూ గొడవపడుతుంటారని, జోలీ కన్నా బ్రాడ్ భద్రత గురించి తనెక్కువగా ఆందోళన చెందుతుండే వాడినని తెలిపాడట. ముఖ్యంగా ఏంజలీనా నాగు పాములా అతని మీద విరుచుకు పడేదట. ప్రతి నిమిషం అతన్ని భయపెడుతూ, విసుక్కుంటూ వుండేదని తెలిపాడట. ఆమె ఎంత సెక్సీగా వుంటే ఏంటి, అలాంటి వారితో ప్రతిరోజూ కలసి వుండటం చాలా కష్టమని ఆయన వ్యఖ్యానించినట్టు హాల్పెరిన్ తెలిపాడు. పరిస్థితులను బట్టి చూస్తుంటే వీరిద్దరూ మరో 18 నెలల్లో విడిపోనున్నారని కూడా హాల్పెరిన్ 'బ్రాంజెలీనా' లో వివరించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X