వాళ్శిద్దరి మధ్య రోమాన్స్ గురించి చాలా మందికి అపోహాలు ఉన్నాయి..!
హాలీవుడ్ అందమైన జంట బ్రాడ్ పిట్ మరియు ఏంజిలినా జోలీ. 2005వ సంవత్సరంలో మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ చిత్రంలో వీరిద్దరి మద్య మొదలైన ప్రేమ వీరికి ఆరుగురు పిల్లలను పోషించే స్దాయికి చేరింది. ఈచిత్రం తర్వాతే వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా అప్పటి వరకు కలసి ఉన్న తన మొదటి భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ నుకాదని ఏంజిలినా జోలీని పెళ్శాడారు మన బ్రాడ్ పిట్.
అప్పటి నుండి వీరిద్దరి పేర్లలో ఉన్న మొదటి అక్షరాల ఆధారంగా యావత్ బాలీవుడ్ వీరిని 'బ్రాంజిలినా'గా పిలవడం మొదలుపెట్టిన విషయం అందరికి తేలిసిందే. అంతేకాకుండా వీరిద్దరి రోమాన్స్ గురించి చాలా మందికి చాలా అపోహాలు ఉన్నాయి. వీరిద్దరూ రోమాన్స్ లో చాలా ఆధునాతన పద్దతులను ఉపయోగిస్తారని సమాచారం. వీరి అభిమానులు వీరిని ముద్దుగా మోనికర్ అని పిలుచుకుంటారని చాలా మందికి తెలుసు.
ఇంతకి అసలు విషయం ఏమిటంటే ఏంజిలినా జోలి స్వీయ దర్శకత్వంలో బోస్నియా యుద్దం గురించి ఓ సినిమా రూపోందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈచిత్రంలో ఏంజిలీనా జోలి ఓ ముఖ్య భూమికను పోషిస్తుంది. అంతేకాకుండా గతంలో బోస్నియా యుద్దం జరుగుతున్న సమయంలో కోంత మంది బోస్నియా మహిళలు పైన పైశాచికంగా వారిని రేపే చేసి, అనుభవించిన తీరుని మన కళ్శకు కట్టినట్లుగా చూపించడానికి సిద్దమైన విషయం మనకు తెలిసిందే.
ఇటీవల కాలంలో ఈసినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బ్రాడ్ పిట్ ఆప్రదేశానికి వెళ్శడం జరిగింది. ఆసమయంలో చాలా మంది సెట్ లోఉన్న వర్కర్లు ఏంజిలీనా జోలిని 'బ్రాంజిలినా'గా పిలవడంతో అక్కడున్న బ్రాడ్ పిట్ ఒకింత ఆశ్చర్యానికి గురైనాడు. దాంతో ఏంజిలీనా జోలి దానికి బదులుగా వర్కర్స్ తో మాట్లాడుతూ నేను బ్రాడ్ పిట్ అలా ఎప్పుడా పిలుచుకోలేదు. అదే సమయంలో బ్రాడ్ పిట్ ఏదో అనగా నవ్వుతూ 'బ్రాంజిలినా' అనే పదం సౌండ్ ఏదో బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ పేరులా ఉందని అన్నారు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడం జరిగిందన్నారు.


Click it and Unblock the Notifications











