For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రాడ్ పిట్, ఏంజలీనాలు కలిసే వున్నారు...!!

    By Kuladeep
    |

    హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీలు విడిపోయారనే వార్తలు హాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. ఏంజలీనా సిరియా దేశం నుండీ ఓ పాపను దత్తతకు తీసుకోవాలని అనుకుంటోందని, దీనిని బ్రాడ్ వ్యతిరేఖిస్తున్నాడని, దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని వీటి కారణంగా వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ వార్తలేవీ నిజం కాదని ఇటీవల జరిగిన ఓ సంఘటన నిరూపించింది.

    ఇటీవల జరిగిన మోకా 30వ వార్షకోత్సవానికి వీరిద్దరూ కలసి రావడమే కాకుండా ఎంతో అన్యోన్యంగా కనిపించారు. వారిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని వారిని చూసిన వారంతా ముక్తకంఠంతో వంతపాడారు. దీంతో ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు వచ్చిన మాట వాస్తవమే కానీ అవి వారిద్దరి అనుబంధాన్ని తెంచేయగలది కాదని అందరూ చెప్పుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X