ఏంజలీనా, బ్రాడ్ పిట్‌లతో...కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమీ!
హైదరాబాద్: ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న హాలీవుడ్ హాట్ కపుల్ ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్....‘క్రావ్ మెగా' అనే మిలిటరీ స్టైల్ సెల్ప్ డిఫెన్స్ (మార్షల్ ఆర్ట్స్)లో శిక్షణ తీసుకుంటున్నారు. వారు నటించబోయే ‘బై ది సీ' అనే సినిమా కోసమే వీరు ఈ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విద్య నేర్చుకున్న వారు ఎలాంటి వారినైనా తుక్కురేగ్గొడతారట. సో...ఇకపై వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట.
దాదాపు ఏడెనిమిదేళ్లుగా సహజీవనం అనంతరం హాలీవుడ్ సెక్సీ జోడీ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పెళ్లి చేసుకున్నారు. దంపతులయ్యారు. 2005 నుండి కలిసి సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ 2012లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో వీరి వివాహం జరిగింది.

ఈ ఏడేళ్ల సహజీవనంలో ఈ జంట ముగ్గు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా 'బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.
2005లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ.....ఒకరి కోరికలను మరొరు ఆస్వాదిస్తూ చూడముచ్చటైన ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











