స్టార్ హీరో జల్సాలు... రూ. 40కోట్లతో లగ్జరీ పడవ!
పారిస్: సినిమా రంగంలో నిలదొక్కుకుంటే డబ్బే డబ్బు. ఇక స్టార్ హీరోల సినిమాలకు ఉండే డిమాండ్ దృష్ట్యా వారి రెమ్యూనరేషన్ కూడా అదే రేంజిలో ఉంటుంది. మన టాలీవుడ్ టాప్ హీరోల సంపాదనే సాలీనా దాదాపు 20 నుంచి 50 కోట్ల వరకు ఉంటోంది. బాలీవుడ్ స్టార్ల సంపాదన 100 కోట్లకు చేరువలో ఉంటోంది. మరి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన హాలీవుడ్ స్టార్ల సంపాదన ఏ రేంజిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సంపాదనకు తగిన విధంగా వారి లైఫ్ స్టైల్ కూడ లగ్జరీగానే ఉండట సహజమే.
తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ ఫిట్ 5 మిలియన్ పౌండ్ల(దాదాపు రూ. 40 కోట్లు)ను వెచ్చించి ఓ విలాసవంతమైన పడవను కొనుగోలు చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు. సకల సౌకర్యాలతో కూడిన ఈ నౌకలో ప్రస్తుతం బ్రాడ్ ఫిట్ తన ఆరుగురు పిల్లలు, ఫియాన్సీ ఏంజెలీనా జోలీతో కలిసి జల్సా చేస్తున్నాడని ఇంటర్నేషనల్ మీడియా టాక్.
ప్రస్తుతం ఫ్రాన్స్ దక్షిణాన ఉన్న సముద్ర జల్లాలో లగ్జరీ నౌకలో విహరిస్తూ లైఫ్ ను జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడట బ్రాడ్ ఫిట్. బ్రాండ్ ఫిట్ ప్రస్తుతం ఏంజెలీనా జూలీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.
అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











