విడాకుల తరువాత 60 కోట్లు ఇచ్చా.. అయినా బజారుకు లాగుతోంది, హీరో ఆవేదన!

Recommended Video

Brad Pitt Denied The Claims Made By Angelina Jolie's lawyer

అందాల తార ఏంజెలినా జోలీ, ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ 2014 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్లు గడిచేసరికి వీరి బంధం పెటాకులైంది. 2016 లో బ్రాడ్ పిట్, ఏంజెలినా విడిపోయారు. అప్పట్లో ఇది షాకింగ్ న్యూస్. ఈ వార్తతో ఏంజెలినా అభిమానులు చాలా బాధపడ్డారు. విడిపోయిన తరువాత కూడా వీరి మధ్య వివాదాలు ఆగడం లేదు. తగి వచ్చిన పిల్లని కొడుతున్నాడనే కోపంతో ఏంజెలినా బ్రాడ్ పిట్ నుంచి విడిపోయింది. తాజగా వీరి రచ్చ కోర్టుకెక్కింది.

కోర్టులో పిటిషన్

కోర్టులో పిటిషన్

ఏంజెలినా ఇటీవల బ్రాడ్ పిట్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల అనంతరం పిల్లల సంరక్షకు బ్రాడ్ పిట్ తగినంత ధనం ఇవ్వలేదని ఏంజెలినా ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

 పబ్లిసిటీ కోసమే

పబ్లిసిటీ కోసమే

ఏంజెలినా తరుపున లాయర్ ఇటీవల ఈ విషయాన్ని మీడియా ముందు వివరించారు. దీనిపై బ్రాడ్ పిట్ ఘాటుగా స్పందించాడు. అనవసరంగా మరో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. మీడియాని పిలిచి పబ్లిసిటీ పొందే ప్రయత్నం ఇది బ్రాడ్ పిట్ ఆరోపించాడు.

60 కోట్లు

60 కోట్లు

తాను పిల్లల సంరక్షణ కోసం ఏంజెలినాకు ఇప్పటికే 60 కోట్లు (దాదాపు 9 మిలియన్ డాలర్స్) ఇచ్చానని బ్రాడ్ పిట్ చెబుతున్నాడు. అయినా కూడా తనని బజారుకు ఈడ్చే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇల్లు కొనడానికి

ఇల్లు కొనడానికి

ఆ మధ్యన ఏంజెలినా కొత్తగా విలాసవంతమైన నివాసం కొనుగోలు చేసింది. ఆ ఇంటికి కోసం 60 కోట్లలో 54 కోట్లు లోన్ గా ఇప్పించానని బ్రాడ్ పిట్ చెబుతున్నాడు. ఏంజెలినా ఆరుగురు పిల్లలని పోషిస్తోంది.

11 ఏళ్ల పాటు

11 ఏళ్ల పాటు

ఏంజెలినా, బ్రాడ్ పిట్ దాదాపు 11 ఏళ్లపాటు సహజీవనం చేసి 2014 లో పెళ్లి చేసుకున్నారు. అనుకోని విభేదాలతో ఈ జంట 2016 లో విడాకులు పొందారు. హాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఏంజెలినా ప్రస్తుతం సినిమాలు కూడా తగ్గించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X