ప్రియురాలి కోసం విమానం కొంటున్న స్టార్ హీరో
ఏంజలీనా జోలీకి ఫైలట్ లైసెన్స్ కూడా ఉంది. 2004లోనే ఆమె ఫైలల్ శిక్షణ పూర్తి చేసుకుని లైసెన్స్ పొందింది. విమానాలు నడపడం అంటే ఆమెకు మహా సరదా కూడా. అందుకే ప్రియురాలికి ఎంతో ఇష్టమైన, బోలెడంత ఖరీదైన కానుకను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాడు బ్రాడ్ పిట్.
ప్రస్తుతం బ్రాడ్ పిట్ 'వరల్డ్ వార్ 2' షూటింగులో భాగంగా లండన్‌లోని ప్యూరీలో ఉన్నాడు. ఏంజలీనా జోలీ ప్రస్తుతం 'అన్ బ్రోకెన్' అనే యుద్ద నేపథ్యంలో సాగే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ హవాయ్‌లో ఉంది. వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వీరు సొంతంగా విమానం కొనుక్కుంటే ఎంచక్కా తరచూ కలుసుకోవడానికి వీలుందని భావిస్తున్నారు.
అంతే కాదండోయ్....ఏంజలీనా జోలీకి మరో చిరకాల కోరిక కూడా ఉందట. జెట్ విమానంలో సముద్రాలన్నింటినీ చుట్టిరావాలని ఆమె కోరికట. సొంతంగా విమానం కొనుక్కున్న తర్వాత వీరిద్దరూ ఏకాంతంగా సముద్రాలను చుట్టి వస్తారేమో చూడాలి మరి.
2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, మరో ముగ్గురికి వారు జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications












