కూతురిని ముద్దాడుతూ గాయపడిన సూపర్ స్టార్
హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ తన కూతురు 'వివిన్'ని ముద్దాడుతుండగా.. తప్పటడుగు వేయడంతో మోకాలు గాయపడడంతో ప్రస్తుతం కర్ర సహాయంతో వాకింగ్ చేస్తున్నారు. ఈ విషయం మనకు ఎలా తెలిసిందని అనుకుంటున్నారా.. 48 సంవత్సరాలు వయసు కలిగిన ఈ స్టార్ హీరో ఇటీవల జరిగిన '23వ ఫామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గాలా'కి రెడ్ కార్పెట్‌పైకి కర్రతో వచ్చి అక్కడున్న అందరిని ఆశ్చర్య పరిచారు.
దాంతో అక్కడున్న విలేకరలు బ్రాడ్ పిట్‌ని చుట్టుముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వారి ప్రశ్నలకు ఓపికగా బ్రాడ్ పిట్ సమాధానాలిచ్చారు. ఈ సందర్బంలో బ్రాడ్ పిట్ మాట్లాడుతూ మా కూతురు వివిన్‌ని ఎత్తుకోని ఇటీవలే కొత్తగా మేము వెళ్లిన వాటర్ ఫాల్ హౌస్‌లో జారి క్రింద పడగా, మోకాలికి చిన్న దెబ్బ తగిలిందని ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదని అన్నాడు.
తనతో పాటు ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చిన ఏంజిలీనా జోలీ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మూడు సంవత్సరాల వయసు కలిగిన వివిన్‌కు ఎటువంటి ప్రమాదం కాలేదని అన్నారు. పిట్‌కు ఈ ప్రమాదంలో డాక్టర్లు ఎటువంటి సర్జరీ అవసరం లేదని అన్నారు. కేవలం కర్రతో కొన్నిరోజులు నడిస్తే అంతా ఓకే అవుతుందని అన్నారని తెలిపింది. నాకు మాత్రం పిట్ ఈ కర్రతో చాలా అందంగా ఉన్నాడంటూ సరదాగా వ్యాఖ్యానించింది.
ఇటీవల బ్రాడ్ పిట్ పుట్టిన రోజు కానుకగా బ్రాడ్ పిట్‌పై ఉన్న ప్రేమను తెలిపేందుకు గాను ఏంజిలీనా జోలీ 'వాటర్ ఫాల్'ని గిప్ట్‌గా ఇచ్చింది. ఈ వాటర్ ఫాల్ హౌస్‌లోనే ఈ సంఘటన సంభవించింది.


Click it and Unblock the Notifications











