For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 812 కోట్ల విషయంలో హీరో, హీరోయిన్ మధ్య వివాదం?

|

ఒకప్పుడు హాలీవుడ్లో ఆదర్శ ప్రేమ జంటగా, దంపతులుగా వెలుగొందిన ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోర్టుకు వీరి విడాకులను ఆమోదిస్తూ అఫీషియల్‌గా సింగిల్ స్టేటస్ ఇచ్చేసింది. ఇకపై ఎవరి జీవితం వారిది.

ఇద్దరూ విడిపోయినప్పటికీ తమ ఆరుగు పిల్లలకు పంచాల్సిన ఆస్తుల విషయంలో మాత్రం వివాదాలు ఇంకా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఏంజెలీనా జోలీ తన 116 మిలియన్ డాలర్స్(రూ. 812 కోట్లు) విలువైన ఎస్టేట్ మొత్తాన్ని ఒకే కొడుక్కు కట్టబెడుతోందని, మిగతా ఐదుగరికి ఏమీ ఇవ్వడం లేదనే వార్తలు హాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

జోలీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మాజీ భర్త

జోలీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మాజీ భర్త

ఏంజెలీనా జోలీ తన ఎస్టేట్ మొత్తాన్ని 17 ఏళ్ల కుమారుడు మడోక్స్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని టాక్. ఆమె వద్ద ఉన్న మొత్తం ఆస్తి ఇదే. అయితే మిగతా ఐదుగురికి ఏమీ ఇవ్వకుండా ఒకరికే ఈ మొత్తం ఇవ్వడంపై బ్రాడ్ పిట్ సైతం అసంతృప్తిగా ఉన్నాడట.

మడోక్స్ విషయంలోనే ముందు నుంచీ గొడవ

మడోక్స్ విషయంలోనే ముందు నుంచీ గొడవ

మడోక్స్ విషయంలోనే ఏంజెలీనా, బ్రాడ్ పిట్ మధ్య మొదటి నుంచీ గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణం కూడా ఈ కొడుకు విషయంలో 2016లో జరిగిన గొడవే అనే రూమర్స్ సైతం హాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారంలో ఉన్నాయి.

తల్లికి సపోర్టుగా మడోక్స్

తల్లికి సపోర్టుగా మడోక్స్

జోలీకి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు మడోక్స్ చూసుకుంటున్నాడని, ఇతడు ముందు నుంచీ తన తల్లి సైడే ఉంటున్నాడని, అతడంటే ఆమెకు అమితమైన ప్రేమ... అందుకే తన రూ. 812 కోట్ల విలువైన ఎస్టేట్ అతడికే కట్టబెట్టాలనే ఆలోచలనో ఉందనే మరో కథనం కూడా ఉంది.

ఆరుగురు పిల్లలు

ఆరుగురు పిల్లలు

ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ దంపతులకు ఆరుగు పిల్లలు. మడోక్స్, పాక్స్, జహారా, షిలోష్ పాటు కవలలు నోక్స్, వివియెన్ ఉన్నారు. వీరిలో మడోక్స్, పాక్స్, జహారా దత్తత తీసుకున్నవారు కాగా... షిలోష్ పాటు కవలలు నోక్స్, వివియెన్‌లకు స్వయంగా జన్మనిచ్చారు.

English summary
As per an alleged report by RadarOnline, Angelina Jolie is planning to leave her entire estate of $116 million to her son Maddox and is planning to give nothing to the remaining five children of hers. The alleged insider revealed that Brad Pitt is apparently not happy with Angelina's sudden decision.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more