భార్య సినిమాలతో... భర్త ఇంటి పనులతో బిజీ బిజీ..
ఈ సంఘటన వారి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. ఆమె సినిమా షూటింగ్ తో బిజీగా వుంటే ఆయన తనో స్టార్ హీరో అనే ఇగోను పక్కన పెట్టి తమ ఆరుగురు పిల్లల ఆలనాపాలనా చూస్తూ బిజీగా వున్నాడు. వారే హాలీవుడ్ క్రేజీ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్. ఎంజలీనా ప్రస్తుతం ది టూరిస్ట్ సినిమా కోసం వెనీస్ లో వుంది. బ్రాడ్ పిట్ కూడా ఆమె కోసం తమ ఆరుగురు పిల్లలతో కలసి అక్కడ వాలిపోయాడు. దీంతో జోలీ ఇంటిని పిల్లలని మిస్ అవుతున్నాననే భావన లేకుండా హాయిగా షూటింగు కు వెళ్లి ఇంటికొచ్చి తన భర్తపిల్లలతో సమయం గడుపుతోందట. బ్రాడీ కూడా ఆమె లేనప్పుడు పిల్లల ఆలనాపాలనా చూస్తూ సమయం గడిపేస్తున్నాడట. ఈ పరిణామాలతో త్వరలో వీరిద్దరూ విడిపోనున్నారని ప్రచారం చేసినవారు బిక్కమొహం వేస్తున్నారు.
More from Filmibeat
ఏంజలీనా జోలీ బ్రాడ్ పిట్ హాలీవుడ్ ది టూరిస్ట్ జానీ డెప్ angelina jolie brad pitt hollywood the tourist johnny depp


Click it and Unblock the Notifications











