'దెయ్యం'లా భయపెట్టడానికి సిద్ధం అవుతున్న సెక్సీ హీరో..!!
హాలీవుడ్ సెక్సీ హీరో బ్రాడ్ పిట్ ఓ దెయ్యం కథతో రూపొందే సినిమాలో నటించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇంతకు ముందు ట్విలైట్ వంటి ఆత్మల చుట్టూ తిరిగే కథతో సినిమాను రూపొందించిన నిర్మాణ సంస్థ ఈ సినిమా ను బ్రాడ్ పిట్ తో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు 1994లో బ్రాడ్ 'ఇంటర్యూ విత్ వ్యాంపైర్' అనే సినిమాలో నటించాడు.
ఆ తర్వాత ఇప్పుడు 'వ్లాడ్' అనే దెయ్యం కథతో రూపొందే ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలయిన దెయ్యం కథతో రూపొందిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు హాలీవుడ్ లో ఈ తరహా సినిమాల రూపకల్పన ఊపందుకుంది. ఇటీవల విడుదలయిన 'న్యూ మూన్' అనే ఆత్మల చుట్టూ తిరిగే కథ తో రూపొందిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే.
కాగా బ్రాడ్ పిట్ తాను దర్శకత్వం వహించబోతున్నానని వస్తున్న వార్తలను కొట్టిపారేసాడు. దర్శకుడికి ఎంతో నేర్పు వుండాలని, తనకి అంత సీన్ లేదని చెప్పాడు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా దర్శకత్వం వహించబోనని ఆయన స్పష్టం చేసాడు.


Click it and Unblock the Notifications











