సూపర్ స్టార్ సినిమా సెట్‌పై పోలీసుల రైడింగ్
హాలీవుడ్ రోమాంటిక్ హీరో బ్రాడ్ పిట్ ప్రస్తుతం నటిస్తున్న జింబాబ్వే చిత్రం 'వరల్డ్ వార్ జడ్'. 'బుధాపెస్ట్'లోని సినిమా సెట్‌పై హంగేరియన్ పోలీసులు రైడ్ చేసి 85 ఆయుధాలను సీజ్ చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మేము సీజ్ చేసిన ఆయుధాలలో AK-47, స్నిప్పర్ రైఫిల్స్ లాంటివి స్వాధీనం చేసుకొవడం జరిగిందని తెలియజేశారు.
ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా బుధాపెస్ట్ లోని ఓ వేర్ హౌస్ గౌడన్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై హాంగేరియన్ పోలీసులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వారితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని, అంతవరకు దీనిపై స్పందించనని సినిమా నిర్మాతలు తెలియజేశారు.
ఇది ఇలా ఉండే బ్రాడ్ పిట్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 2012లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మార్క్ ఫోస్టర్ వహిస్తున్నారు. ఈ సినిమాలో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించగా, మ్యాధ్యూ ఫాక్స్, డేవిడ్ మోర్స్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని ప్రముఖ నవలా రచయిత మాక్స్ బ్రూక్స్ రాసినటువంటి రియల్ స్టోరీ ఆధారంగా తీయడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications











