Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మూడు సంవత్సరాల తర్వాత 'నో' సినిమాలు: సూపర్ స్టార్
హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ప్రస్తుతం హ్యాపీ ఫీట్ టు, కాగన్స్ ట్రేడ్, వరల్డ్ వార్ జడ్ అనే సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 47సంవత్సరాల వయసు కలిగిన బ్రాడ్ పిట్ ఇటీవల ఆస్ట్రేలియన్ ఛాట్ షో 60 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంలో బ్రాడ్ పిట్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే తనకి 50 సంవత్సరాలు వయసు రాగానే సినిమాలలో నటించనని అన్నారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
అంతేకాకుండా ఇప్పటివరకు నా జీవితంలో ఎన్నో సినిమాలలో హీరో పాత్ర వేషాలు వేయడం జరిగింది. కానీ నా జీవితంలో డైరెక్షన్ చేయలేదనే వెలితి ఉంది. అందుకే ఇక రాబోయే మూడు సంవత్సరాలలో ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత సినిమాలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రాబోయే కాలంలో ఎక్కువ భాగం సినిమాలు నిర్మించడంలోను, సినిమాలను డైరెక్ట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని అన్నారు.
ఇక ఇటీవలే బ్రాడ్పిట్ హీరోగా నటించిన 'మనీబాల్' సినిమాని ప్రమోట్ చేసేందుకు గాను బ్రాడ్పిట్ భార్య ఏంజిలీనా జొలీ, వీరి పిల్లలు అందరూ కూడా ప్రస్తుతం జపాన్ రాజధాని 'టొక్యో'కి చేరుకొని, ప్రత్యేకంగా వీకెండ్ ప్రీమియర్ షోని జపాన్లో ఉన్న అభిమానులతో కలసి ఈ జంట వీక్షించడం జరిగింది.