పిల్లల మాటకు ప్రాధాన్యం ఇచ్చిన సూపర్ స్టార్
ఎంతటి సూపర్ స్టార్ అయిన తన కిడ్స్ ప్రేమకు దాసొహావంతుడే. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్. ఇటీవల బ్రాడ్ పిట్ ఒంటరిగా సిగరెట్స్ త్రాగుతుండగా తన కిడ్స్ చూసి , త్రాగడం మంచిది కాదునాన్న అని అనగా తన కిడ్స్ కొసం పొగ త్రాగేటటువంటి అలవాటు ఉన్న బ్రాడ్ పిట్ ఒక్కసారిగా మానివేశాడని సమాచారం.
వివరాల్లోకి వెళితే 47సంవత్సరాలు వయసు కలిగిన బ్రాడ్ పిట్ హాలీవుడ్ అందాల తార ఏంజిలీనా జొలీ గత ఆరు సంవత్సరాలుగా కలసి ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఆరుగురు కిడ్స్ అన్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ ఆరుగురులో బ్రాడ్ పిట్, జోలీకి పుట్టిన కిడ్స్ ముగ్గురు కాగా, మిగిలిన ముగ్గురుని జోలీ దత్తతు తీసుకొని పెంచడం జరుగుతుంది.
బ్రాడ్ పిట్, జోలీ ప్రస్తుతం బుధాపెస్ట్‌లో ఓ అద్దె ఇంట్లో జీవిస్తున్న సంగతి తెలిసిందే. బుధాపెస్ట్‌లో ఉన్న ఈ డ్రీమ్ హౌస్ గార్డెన్‌లో సరదాగా, బ్రాడ్ పిట్ సిగరెట్ త్రాగుతుండగా బ్రాడ్ పిట్ కిడ్స్ జహారా(6 సంవత్సరాలు), షిల్లా(5 సంవత్సరాలు) చూడడం జరిగింది. దాంతో ఇద్దరూ బ్రాడ్ పిట్ వద్దకు వెళ్లి నాన్న పొగత్రాగడం నీ ఆరోగ్యానికి మంచిది కాదని సలహా ఇచ్చారంట. దాంతో బ్రాడ్ పిట్ తన కిడ్స్ చెప్పిన మాటలకు ఏకీభవిస్తూ నేను పొగ త్రాగడం మానివేస్తున్నానని అన్నారంట.
ఇది ఇలా ఉంటే బ్రాడ్ పిట్ ప్రస్తుతం నటిస్తున్న జింబాబ్వే చిత్రం 'వరల్డ్ వార్ జడ్'. 'బుధాపెస్ట్'లోని సినిమా సెట్‌పై హంగేరియన్ పోలీసులు రైడ్ చేసి 85 ఆయుధాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఆయుధాలలో AK-47, స్నిప్పర్ రైఫిల్స్ లాంటివి స్వాధీనం చేసుకొవడం జరిగిందని పోలీసులు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











