పిట్.. జోలీకి ప్రపోజ్ చేసిన వేళ.. కన్నీటి సంద్రం
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌లో ఇప్పుడు ఎవరి నోట విన్నా బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహం గురించే చర్చ. అసలు బ్రాడ్ పిట్, జోలీకి పెళ్లి చేసుకోబోయే విషయాన్ని ఎలా ప్రపోజ్ చేశాడో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. అది ఎలాగంటే బ్రాడ్ పిట్ తన ఆరుగురు పిల్లలతో కలసి జోలీ వద్దకు వెళ్లి నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని అనగానే జోలీ కళ్ల వెంట నీళ్ళు గిర్రున తిరగడమే కాకుండా.. ఆ సందర్బంలో తాను ఏమీ మాట్లాడాలో తెలియని స్దితిలోకి వెళ్లిందని సమాచారం.
ఈ సందర్బంలో పిట్, జోలీల పిల్లలు ఒక్కసారిగా ఆనందానికి లోనవ్వడమే కాకుండా ఎంతగానో సంతోషించారు. ఎప్పుడైతే జోలీకి పిట్ వజ్రాల రింగ్ ని చేతికి తొడగగా.. పిల్లలు అందరూ ఒక్కసారిగా ఇద్దరిని చుట్టుముట్టి హాత్తుకున్నారు. అసలు బ్రాడ్ పిట్ పిల్లలు బలవంతం మేరకు గతయేడాది క్రిస్టమస్‌కు తన ప్రేమను ప్రపోజ్ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఏంజిలీనా జోలీ సొంతంగా దర్శకత్వం వహిస్తున్న “In the Land of Blood and Honey" సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండడం వల్ల వాయిదా వేసుకున్నట్లు పిట్ అధికార ప్రతినిధి తెలిపారు.
పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.
బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఈ వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.
గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. గత ఏడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ శనివారం నిశ్చితార్దం జరిగినట్లు అధికారకంగా వెల్లడించారు. ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











