నాకంత సీన్ లేదంటున్న స్టార్ హీరో...!!
హాలీవుడ్ నటుడు, అమ్మాయిల కలల రాకుమారుడు బ్రాడ్ పిట్ తనకు దర్శకత్వం వహించే ఆలోచన లేదని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ తను దర్శకత్వం చేస్తాడా అనే ప్రశ్నకు సమాధానంగా నేనెప్పుడూ సినిమాకు దర్శకత్వం వహించలేనని, తన చంచల స్వభావంతో పూర్తిగా సినిమా దర్శకత్వం మీద దృష్టి పెట్టడం కష్టం అని చెప్పాడు. అంతే కాదు సినిమా దర్శకుడు మిస్టర్ పర్ఫెక్ట్ గా వుండాలని, తనలా వుండలేనని, తనకి అప్పుడప్పుడు పిచ్చి పడుతుందని... అలాంటి నేను సినిమాకు దర్శకత్వం వహించే సాహసం చెయ్యలేనని స్పష్టం చేసాడు.
తాజాగా బ్రాడ్ పిట్ 'డార్క్ వాయిడ్' అనే సినిమాలో నటించనున్నట్టు తెలిసిందే. ఈ సినిమాను బ్రాడ్ హోమ్ ప్రొడక్షన్ "ప్లాన్ బి ఎంటర్టెయిన్మెంట్స్" నిర్మించనుంది. ఇదిలా వుంటే బ్రాడ్ సహచరిణి ఏంజలీనా జోలీ నటించిన 'సాల్ట్' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జోలీ చేసిన సాహసాలు హైలెట్ గా నిలుస్తాయని దర్శకనిర్మాతలు అంటున్నారు.


Click it and Unblock the Notifications











