గే మ్యారేజీలకు మద్దతు ఇస్తున్న స్టార్ హీరో
లండన్ : హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ ఫిట్ గే మ్యారేజ్‌లకు సపోర్టు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వంత పాడారు. గే మ్యారేజీల వల్ల సమాజానకి వచ్చిన నష్టం ఏమీ లేదని, వారిని మరో కోణంలో చూడకుండా మామూలు మనుషులుగానే చూడాలని, స్వలింగ సంపర్కుల లైంగిక సంబంధాలను తప్పుగా చూడొద్దని అంటున్నాడు.
తన నటించిన 'కిల్లింగ్ దెమ్ సాప్ట్లీ' చిత్రం ప్రమోషన్లో భాగంగా లండన్‌లోని మేఫేర్ హోటల్‌లో బ్రాడ్ ఫిట్ మీడియాతో మాట్లాడుతూ...గే మ్యారేజీలు అనివార్యం. మనం ఇప్పుడు వ్యతిరేకించినా నెక్ట్స్ జనరేషన్ వారు వాటిని తప్పకుండా ఆమోదిస్తారు, జరుగబోయేది అదే అని వ్యాఖ్యానించారు.
సేమ్ సెక్స్ మ్యారేజీలను సపోర్టు చేస్తున్నందున నేను ఒబామాకు మద్దతుదారుగా మారానని, త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్షన్ కాంపెయిన్లో పాల్గొంటానని వెల్లడించారు. బ్రాడ్ ఫిట్ ప్రకటనతో స్వలింగ సంపర్కులైన ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్రాండ్ ఫిట్ ప్రస్తుతం ఏంజెలీనా జూలీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











