సైఫ్-కరీనా బంధంపై హాలీవుడ్ స్టార్ బ్రాడ్‌ఫిట్ కామెంట్స్
లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో వీరి వివాహం జరుగబోతోంది. తాజాగా ఈ జంట బంధంపై హాలీవుడ్ స్టార్ యాక్టర్ బ్రాండ్ ఫిట్ కామెంట్ చేసారు. ఓ ఇంటర్వ్చూలో ఆయన మాట్లాడుతూ....సైఫ్, కరీనా గుడ్ లుకింగ్ కపుల్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వారి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు.
పెళ్లి డేట్‌ను సైఫ్-కరీనా అధికారికంగా ప్రకటించక పోయినా...బాలీవుడ్ వర్గాలు మాత్రం అక్టోబర్ 17న వారిద్దరూ మనువాడనున్నట్లు చెబుతున్నాయి. నాలుగైదేళ్లుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌కు పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కరీనా కూడా గతంలో షాహిద్ కపూర్‌తో ఎఫైర్ కొనసాగించింది.
బ్రాండ్ ఫిట్ ప్రస్తుతం ఏంజెలీనా జూలీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.
విడాకులు, మళ్లీ పెళ్లి లాంటి పరిణామాలతో సైఫ్-కరీనా, బ్రాడ్ ఫిట్-ఏంజలీనా జంటల మధ్య దగ్గరి పోలికలు ఉండటంతో బ్రాడ్ ఫిట్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


Click it and Unblock the Notifications











