నాపిల్లలు సినిమా ఎంతగానో బాగుందని కితాబు ఇచ్చారు..అది చాలు
హాలీవుడ్ ఎవరీగ్రీన్ జంట బ్రాడ్ పిట్ మరియు ఏంజిలీనా జోలి ఇటీవల పారిస్ లోని యూరోపియన్ ప్రీమియర్ కుముఖ్య అధితులుగా హాజరయ్యారు. ఈసినిమాను 3డి యానిమేషన్ లోచిత్రీకరించడం జరిగిందని బ్రాడ్ పిట్ తెలిపారు. ఈసినిమాలో నేను కూడా ఒక బిట్ కుపాడడం జరిగిందని అన్నారు. నేను ఎప్పుడూ పాటలు పాడిన నాపిల్లలు ముందు మాత్రమే పాడతానని అన్నారు. దానికి కారణం నాపిల్లలు నాపాట కనక బాగలేకపోయినట్లైతే ఇట్చే నాకు వివరించడం జరుగుతుందని అన్నారు. ఈసినిమాని మాపిల్లలు చూసి చాలా బాగుందని కితాబు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఇక ఈసినిమాని ప్రపంచ ప్రసిద్దగాంచినటువంటి డ్రీమ్ వర్క్సు మీడియా రూపోందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నాతోపాటు ఈసినిమాలో విల్ ఫెర్రల్, టీనా ఫే నటించడం జరిగిందని తెలిపారు. ఈసినిమాకు మెగా మైండ్ అని నామకరణం చేసిన సంగతి అందిరికి తెలిసిందే. మెగా మైండ్ సినిమా షూటింగ్ సమయంలో విల్ ఫెర్రల్ నాతో మాట్లాడుతూ ఇలాంటి యానిమేటెడ్ సినిమాల్లో పనిచేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా మేము అందరం కలసి చాలా ఉత్సాహాంగా ఈమెగా మైండ్ లోచేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా డైరెక్టర్ టామ్ మెక్ గ్రాత్ ఈసినిమాను మలచిన తీరు అధ్బుతం అని అన్నారు. షూటింగ్ సమయంలో డైరెక్టర్ టామ్ మమ్మల్ని అండర్ వేర్ మీద వచ్చినా నాకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని అనేవారని అన్నారు. దీనికి కారణం సినిమా అంతా రికార్డ్ సెసెన్స్ లోచేయడం.


Click it and Unblock the Notifications











