మన అందాల బొమ్మపై కన్నేసిన హాలీవుడ్ హీరో
ఇటీవల బ్రాడ్ ఫిట్ మీడియాతో మాట్లాడుతూ...ఐశ్వర్యరాయ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాలని ఉందని, ఒక్క ఛాన్స్ వచ్చినా మహద్భాగ్యమే అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె గొప్ప నటి, బ్రిలియంట్ యాక్ట్రెస్, 'The Mistress of Spices', 'The Last Legion', 'The Pink Panther 2′,'Provoked' చిత్రాల్లో ఐశ్వర్య అద్భుతంగా నటించింది అని పొగడ్తలతో ముంచెత్తాడు బ్రాడ్ ఫిట్. మరి బ్రాడ్ పిట్ కోరిక ఐశ్వర్యరాయ్ విన్నదో లేదు..?
పెళ్ళై కూతురు పుట్టినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తల్లి అయిన తర్వాత ఐశ్వర్యరాయ్ త్వరలో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఐష్ ముందుగా ఏ సినిమాలో నటించబోతోంది? ఎవరితో కలిసి నటించబోతోంది? ఈ విషయాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐష్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. ముందుగా శ్రీరామ్ రాఘవన్'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ....సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న 'బాజీరావు మస్తానీ'అనే సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి రీఎంట్రీ ఇవ్వబోతోందని మరో ప్రచారం కూడా ఉంది.
సిల్వర్ స్ర్కీన్ కు కొంత కాలంగా దూరంగా ఉన్న ఐష్ ను మళ్ళీ చూడాలని ఆమె అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆ అందాన్ని తెరపై కన్నులారా చూడాలని ఆశ పడుతున్నారు. ఐశ్వర్య కూడా అభిమానుల ఆకాంక్షకు తగిన విధంగా కథలను ఎంపిక చేసుకునే పనిలో ఉంది. తల్లినైనా సరే తనలో అందం, అభినయం తగ్గలేదని నిరూపించుకోవడానికి మరోసారి రెడీ అవుతోంది ఐశ్వర్య.


Click it and Unblock the Notifications












