Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రొమాంటిక్ కపుల్ జీవితంలో చిచ్చు పెట్టిన ప్రముఖ సింగర్?
హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్లీ కూపర్, ఇరినా షైక్ అఫీషియల్‌గా విడిపోయారు. తమ నాలుగేళ్ల డేటింగ్ బంధానికి ముగింపు పలికారు. కొంతకాలం క్రితమే ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపాయని మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరి మధ్య చిచ్చు రేగడానికి కారణం ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా అనే వాదన కూడా ఉంది.
అమెరికన్ పత్రిక 'పీపుల్' కథనం ప్రకారం 44 ఏళ్ల బ్రాడ్లీ కూపర్, 33 ఏళ్ల ఇరినా షైక్ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్ల బంధంలో వీరికి లియా అనే కూతురు జన్మించింది. అయితే ఆమె ఎవరి కష్టడీలో ఉండాలనే విషయంలో ఇద్దరూ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట.
పెళ్లి చేసుకుంటారనుకుంటే... విడిపోతున్నారు
అయితే తాము విడిపోయినట్లు బ్రాడ్లీ కూపర్ నుంచి కానీ, ఇరినా షైక్ నుంచి కానీ ఎలాంటి అపీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఈ ఏడాది చివరల్లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావిస్తున్న తరుణంలో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలు షాకయ్యేలా చేసింది.
పాప్ సింగర్ లేడీ గాగా కారణమా?
అయితే వీరు విడిపోవడానికి కారణం ఎవరు? అంటే చాలా మంది నోట ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా పేరు వినిపిస్తోంది. బ్రాడ్లీ కూపర్, లేడీ గాగా ఇటీవల ఓ చిత్రంలో కలిసి నటించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇది కాస్త బ్రాడ్లీ కూపర్-ఇరినా షైక్ మధ్య విబేధాలు మొదలవ్వడానికి కారణమైందని టాక్.
అప్పటి నుంచి రూమర్లకు మరింత ఊతం
ఇటీవల జరిగిన 91వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బ్రాడ్లీ కూపర్-లేడీ గాగా కలిసి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరి ఇంటిమేట్ పెర్ఫార్మెన్స్ అందరినీ మంత్రముగ్దులను చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ మొదలైందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
కూతురు కోసమైనా కలిసి ఉండాలంటున్న ఫ్యాన్స్
అయితే బ్రాడ్లీ కూపర్-ఇరినా షైక్ విడిపోతున్న వార్త అభిమానులు అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. వీరు ఇద్దరూ కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. విబేధాలన్నీ పక్కన పెట్టి తమ కూతురు కోసం అయినా పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించాలని వారు కోరుకుంటున్నారు.