twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లయన్ కింగ్: బ్రహ్మానందం అడవి పంది, అలీ ముంగిస!

    |

    జంతువులు మనషుల్లా మాట్లాడతాయి, మిగతా జంతువులతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం‌లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన 'లయన్ కింగ్' అనే సినిమా కథ.

    డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ... 'లయన్ కింగ్' సినిమాలో సింబ అనే సింహమే హీరో. సింబ‌తో పాటు టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది ఈ చిత్రంలో ముఖ్య పాత్రదారులుగా కనిపించబోతున్నాయి.

    ఒకప్పుడు కార్టూన్ నెట్వర్క్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చిన 'లయన్ కింగ్'.... 1990లో 2డి ఆనిమేటెడ్ సినిమాగా థియేటర్లోకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని ఆధునిక 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. జులై 19న విడుదల అవుతుంది.

    lion king

    విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్షకులను అలరించబోతున్న ఈ చిత్రంలోని పాత్రలకు ప్రముఖ స్టార్లతో డబ్బింగ్ చెప్పారు. ల‌య‌న్ కింగ్‌లో కీల‌కమైన ముసాఫా అనే పాత్రకు షారుక్ డ‌బ్బింగ్ చెప్పారు, ముసాఫా త‌న‌యుడు 'సింబా'కు షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం.

    తెలుగు వెర్ష‌న్‌లో పుంబా పాత్ర‌కు బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం, టీమోన్ పాత్ర‌కు ఆలీ తమ వాయిస్ ఇచ్చారు. తెలుగు వెర్షన్లో వీరు చెప్పే డైలాగులు అద్భుతంగా ఉంటూ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని టాక్. బ్రహ్మానందం మాట్లాడుతూ... 'డిస్నీ మూవీకి డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం ఎంతో గొప్పగా ఉంది, మా పిల్లలు చిన్నతనంలో లయన్ కింగ్‌కు పెద్ద ఫ్యాన్స్. పుంబా పాత్రకు వాయిస్ ఇవ్వడం ఒక భిన్నమైన అనుభూతి.' అన్నారు.

    lion king

    మా ఇంట్లో పిల్లలు కూడా డిస్నీ సినిమాలను ఇష్టపడతారని అలీ తెలిపారు. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి ఆదరణ పొందుతున్నాయి. 'లయన్ కింగ్' చిత్రానికి కూడా అలాంటి ఆదరణే అభిస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    After having conquered hearts with ‘The Jungle Book’ in 2016, Disney is all set to present its legendary franchise and crown jewel - ‘The Lion King’ – with ground-breaking technology that re-imagines the greatest story ever told. Etched forever in pop culture, the animated version was known for its strong and emotional storytelling and memorable characters that won hearts of fans everywhere. And who can forget the perfect comic timing of the beloved friends of Simba - Timon and Pumbaa, who had us insplits every time they come together on screen!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X