కలిసుందామనే అభ్యర్దనను త్రోసిపుచ్చిన భర్త

వివరాల్లోకి వెళితే.. కాటీ పెర్రీ ఈ వారం తన భర్తని లాస్ ఏంజిల్స్‌లో కలవడానికి అంగీకరించడమే కాకుండా.. లాస్ ఏంజిల్స్ కోర్టులో రస్సెల్ బ్రాండ్ అప్పీల్ చేసిన విడాకులను వెనక్కి తీసుకోవలసిందిగా తన భర్తన కోరింది. ఐతే 36 సంవత్సరాల వయసు కలిగిన రస్సెల్ బ్రాండ్ మాత్రం తన స్నేహితుల మాటలను విని, 14నెలలు మ్యారేజిలో పెర్రీని అర్దం చేసుకునేందుకు ప్రయత్నించకపోగా, పెర్రీ అభ్యర్దనను పెడ చెవిన పెట్టాడు.
ఇలా సంసారం విడిపోయి పెర్రీ బాధలో ఉంటే, ఆమె స్నేహితులు మాత్రం కొత్తగా సింగల్ అయినందుకు పార్టీ అడగడం పెర్రీకి నచ్చలేదు. స్నేహితుల చేష్టలకు పెర్రీ కామ్‌గా ఉండడం జరిగింది. పెర్రీ అభ్యర్దనను విని రస్సెల్ తన పంధాని మార్చుకుంటాడేమోనని పెర్రీ స్నేహితులు అనుకున్నప్పటికీ అది ఫలించ లేదు. రస్సెల్ విడాకుల పత్రాలను పెర్రీకి పంపినప్పటికీ తాను మాత్రం అతని ప్రేమలో పడడానికి గల కారణాలను తెలియజేసేందుకు ప్రయత్నించడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తే తాను దానికి కూడా రాలేదని స్నేహితులు తెలియజేశారు. వీరిద్దరి మద్య వచ్చిన మనస్పర్దలు కారణంగా డిసెంబర్ 30న రస్సెల్ బ్రాండ్ విడాకులు కొరిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











