వెన్నునొప్పి తగ్గేందుకు మంచి చిట్కా ఇచ్చారు: బ్రాండ్
లండన్: బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ తన వెన్నునొప్పి త్వరగా తగ్గాలని ఇంగ్లాండ్ ఫేమస్ పుట్ బాలర్ డేవిడ్ బెకహాం సూచలను పాటిస్తున్నాడు. ఇటీవల లండన్ ఒలింపిక్స్‌లో ముగింపు కార్యక్రమంలో డేవిక్ బెకహాం, రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ పాల్గోన్న విషయం తెలిసిందే. ఒలింపిక్ రిహార్సల్స్ లండన్ డాగిహ్నమ్ లోని ఓల్డ్ ఫోర్డ్ ప్లాంట్‌లో జరిగాయి. ఈ సందర్బంలో వీరిద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు.
ఈ విషయంపై బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ మాట్లాడుతూ వెన్ను నొప్పి తొందరగా తగ్గడానికి మీరు ఏమి చేస్తారని ప్రశ్నించాను. గతంలో డేవిడ్ బెకహాం పుట్ బాల్ ఆడే క్రమంలో వెన్ను నొప్పి బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డేవిడ్ బెకహాం వెన్నునొప్పి తగ్గేందుకు గాను ఇంజక్షన్స్‌ని తీసుకున్నాడు. ఈ ఇంజక్షన్స్ ఏమిటని నేను అడడగా.. డేవిడ్ బెకహాం అలాంటివి ఏమీ అక్కర లేదని.. బాడీ మసాజ్ వెన్నునొప్పికి మంచి మందు అని సెలవిచ్చాడు.
స్పైస్ గర్ల్స్‌లో ఒకరిగా ప్రాచుర్యం పొందిన విక్టోరియా బెకహాం, డేవిడ్ బెకహాం భార్య. లండన్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలలో రంగురంగుల ట్యాక్సీపైన ఎక్కి స్పైస్ గర్ల్స్ ప్రాచుర్యం పొందిన పాటలతో ఉర్రూతలూగించారు. సింగర్ అన్నీ లెనాక్స్ ప్రదర్శన సమయంలో బ్రిటిష్ సూపర్ మోడల్స్ నవోమి క్యాంప్‌బెల్, క్యాట్ మాస్‌తోపాటు ఇతరులు తమ క్యాట్‌వాక్‌తో హొయలొలికించారు. వీరితో పాటు సింగర్స్ జార్జి మైఖేల్, రోజర్ డాల్ట్రే, మాథ్యూ బెల్లామి, రస్సెల్ బ్రాండ్, ఫ్యాట్ బాయ్ స్లిమ్ (నార్మన్ కుక్), జెస్సీ జే, నీల్ టెన్నంట్, వన్ డెరైక్షన్ బ్యాండ్, బ్రియాన్ మే తదితరులు అభిమానులను లండన్ ఒలింపిక్స్‌లో అలరించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











